బస్సు డ్రైవర్ నుంచి డిక్టేటర్ వరకూ.. నికోలస్ మదురో అరాచకాలు తెలిస్తే షాక్ అవుతారు !
వెనీజులాలో నికోలస్ మదురో శకం ముగిసింది.ఆ దేశ అధ్యక్షుడు నికోలస్మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. బస్సు డ్రైవర్ నుంచి వెనీజులా డిక్టేటర్ గా ఆయన ఎదిగారు. కొంతకాలం యూనియన్ ఆర్గనైజర్ గానూ మదురో పనిచేశారు.నికోలస్ మదురో.. వెనీజులా రాజధాని కరాకస్ లో నవంబర్ 23, 1962లో జన్మించారు. హై స్కూల్ వరకూ అక్కడే చదివిన మదురో.. కమ్యూనిస్టు భావాల కింద 1982 లో క్యూబాకు వెళ్లారు. ఆ తర్వాత మదురో బస్ డ్రైవర్ గా పనిచేశారు. ఆ తర్వాత యూనియన్ ఆర్గనైజర్ గానూ సేవలందించారు. హ్యూగో చావెజ్ వెనీజులా అధ్యక్షుడైన తర్వాత లా మేకర్ గా మదురో అతనికి సాయపడ్డారు. ఓపెక్ దేశాల ఆయిల్, రాజకీయాలపై చావెజ్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మదురో కృషి చేశారు.
Video Published On: Sunday, Jan 04, 2026, 05:50 [IST]


Click it and Unblock the Notifications