కంకర రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు మధ్య రోడ్డు నరకప్రాయంగా మారింది. పీచుపల్లి వడ్లూరు మధ్య కొంత దూరం రోడ్డు వేశారు. 1 నుంచి 2 కిలో మీటర్లు కంకర వేసి విడిచిపెట్టారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Video Published On: Friday, Mar 20, 2026, 01:13 [IST]


Click it and Unblock the Notifications