రైతు ఖాతాల్లో పీఎం కిసాన్ 22వ విడత రూ.2 వేలు జమ..!
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం- కిసాన్ నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 22వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున జమ అయ్యాయి. అస్సాంలోని గువాహటి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో నిధులను విడుదల చేశారు. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా తెలుసుకోవాలంటే https://pmkisan.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లి తెలుసుకోవాలి.
Video Published On: Saturday, Mar 14, 2026, 04:45 [IST]


Click it and Unblock the Notifications