World Animal Day చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి..?మూగజీవాల పట్ల మనిషి కర్తవ్యం ఏంటి..?

జంతువులంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. ఈ మూగజీవాల కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మూగజీవాలను సంరక్షించేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు కూడా తీసుకొచ్చి అమలు చేస్తున్నాయి. అవి అడవిలో సంచరించే క్రూర మృగాలైనా సరే... మన కళ్ల ముందే తిరిగే సాధు జంతువులైనా సరే. ఏ మూగ జీవిని హింసించే హక్కు మనకు లేదంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ జంతువులు మనుషులపై దాడి చేసినప్పుడు మనిషి నియంత్రణ కోల్పోయి వాటిపై ప్రతి దాడి చేసి చంపేస్తున్నాడు. ఇలాంటి సందర్భాలు చాలా చోటుచేసుకున్నాయి. ఇక మూగ జంతువుల సంరక్షణ కోసం వాటిపై అవగాహన తెచ్చేందుకు అంతర్జాతీయ జంతు దినోత్సవంను పాటిస్తున్నాము. ఇది ఏటా అక్టోబర్ 4వ తేదీన పాటిస్తారు. అసలు అంతర్జాతీయ జంతు దినోత్సవం చరిత్ర ఏంటి ఎందుకు పాటిస్తాము...?

కొన్ని రోజులు నిజంగానే చాలా ప్రత్యేకతను చాటుతాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ ప్రత్యేకమైన రోజులను ఏర్పాటు చేసి ఆ రోజున పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలా అంతర్జాతీయ జంతు దినోత్సవంను అక్టోబర్ 4వ తేదీన పాటిస్తున్నాం. జంతువుల పట్ట మనిషియొక్క బాధ్యతను ఈ సమయంలో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి మూగజీవాల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడు, వాటి జీవనం కోసం ఎలాంటి బాధ్యతలు చేపడుతున్నాడు అనే అంశాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది.

 World Animal Day 2021:Know the history, significance and what humans need to do to animals

ఏటా అక్టోబర్ 4వ తేదీన పలు జంతు సంక్షేమ సంస్థలు, యువత, కొన్ని కమ్యూనిటీ గ్రూపులు, ఇతర వ్యక్తులు అంతర్జాతీయ జంతు దినోత్సవంను జరుపుకుంటారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో నివసిస్తున్న మూగజీవాలకు సురక్షితమైన చోటు ఉండేలా చూడటం లేదా సృష్టించడం. ఈ ఏడాది నినాదం కూడా ఇదే కావడం విశేషం. మూగజీవాలపై జరిగే దాడుల పట్ల, దాడులు జరగకుండా చాలా మందిలో అవగాహన తీసుకువస్తారు. ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పలు జంతు సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జంతువుల పట్ల మనిషి హింసాత్మకంగా ప్రవర్తించరాదని చెబుతున్నాయి. జంతు హక్కులపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆ సంస్థలు చెబుతున్నాయి.

ఇక ఒక్కో దేశంలో ఒక్కో రకంగా అంతర్జాతీయ జంతు దినోత్సవంను జరుపుకుంటాయి.ఈ రోజు పలు దేశాల్లో మూగ జంతువుల పట్ల కర్కశత్వం ప్రదర్శించే వారికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలను గౌరవించుకుంటాయి. అంతేకాదు మూగ జంతువుల పట్ల ప్రేమ, జాలి, దయ, మానవత్వం కలిగి ఉండాలని పిల్లలకు, యువతకు బోధిస్తాయి. ఇక అంతర్జాతీయ దినోత్సవం చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. 1925లో జర్మనీకి చెందిన రచయిత హెన్‌రిచ్ జిమ్మర్‌మాన్ మూగ జంతవుల కోసం ఒకరోజును ప్రత్యేకంగా పాటించాలని ప్రతిపాదించారు. అయితే తొలిసారిగా మార్చి 24వ తేదీన బెర్లిన్‌లో అంతర్జాతీయ జంతు దినోత్సవంను పాటించారు.

ఇక 1929లో తొలిసారిగా అధికారికంగా అక్టోబర్ 4వ తేదీన అంతర్జాతీయ జంతు దినోత్సవంను జరిపారు. జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, చెకోస్లోవేకియా లాంటి కొన్ని దేశాలు మాత్రమే పాటించాయి. ఇక 1931లో ఇటలీలోని ఫ్లారెన్స్‌లో జరిగిన వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్‌లో అంతర్జాతీయ జంతు దినోత్సవంను ఘనంగా పాటించారు. 2002లో ఫిన్‌లాండ్‌కు చెందిన ఓ జంతు సంరక్షణ సంస్థ అంతర్జాతీయ జంతు దినోత్సవం రోజున పలు కార్యక్రమాలు నిర్వహించి పిల్లల్లో జంతువుల పట్ల అవగాహన తీసుకొచ్చింది. 2019లో దాదాపు 56 దేశాలు జరుపుకున్నాయి.

ఇక తొలినాళ్లలో అంతర్జాతీయ జంతు దినోత్సవం థీమ్ మ్యాన్ అండ్ డాగ్‌గా ఉండేది. అయితే కాలక్రమంలో మూగ జంతువులన్నిటినీ సంరక్షించాలనే ఉద్దేశంతో మనిషికి జంతువుకు మంచి సంబంధాలు కలిగి ఉండాలనే థీమ్‌ తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+