World Coconut Day: కొబ్బరికాయతో ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి..!!
కొబ్బరికాయ... మనం రోజు వంటలో వినియోగిస్తాం. కొబ్బరి లేని వంటగది ఉండదు. ఎందుకంటే కొన్ని వంటలకు కొబ్బరి పడితేనే రుచి. కొబ్బరికి ప్రాధాన్యత ఎంతో ఉంది. అందుకే కొబ్బరికాయకు కూడా ఒక రోజును కేటాయించడం జరిగింది. అదే సెప్టెంబర్ 2వ తేదీ. అవును ఏటా సెప్టెంబర్ 2వ తేదీన కొబ్బరికాయ అంతర్జాతీయ కొబ్బరికాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ కొబ్బరి యొక్క ప్రాధాన్యత, దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక కొబ్బరికాయలో ఎన్నో గుణాలున్నాయి. అందుకే చాలా చోట్ల మనకు కొబ్బరికాయ వినియోగం కనిపిస్తుంది. ఎన్నో పరిశ్రమల్లో కొబ్బరికాయను వినియోగిస్తారు.
ఇక శరీరాన్ని కూడా చాలా అందంగా ఉంచుతుంది కొబ్బరికాయ నుంచి తయారయ్యే ఉత్పత్తులు. ఇందులో భాగంగా కొబ్బరి నూనెను మాయిశ్చరైజర్‌గా వినియోగిస్తున్నాం. అంతేకాదు తలకు కూడా కొబ్బరినూనెను పూసుకుంటున్నాం.ఇక కొబ్బరి ఉత్పత్తులను కాస్మెటిక్స్, సబ్బుల తయారీలో వినియోగిస్తున్నాం.ఇక కొబ్బరి ఆకులతో ఫర్నీచర్ లేదా గృహఅలంకారాల్లో వినియోగిస్తున్నాం. కొబ్బరికాయలో ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టే దీనికి అంత ప్రాధాన్యత దక్కింది. కొబ్బరి టెంకకు బయట ఉండే ఫైబర్‌ను తాళ్ల తయారీలో , డోర్ మ్యాట్స్‌లో పరుపుల్లో, బ్రషుల్లో, దుప్పట్ల తయారీలో వినియోగిస్తాం.

ఇక బ్రెజిల్‌లో అయితే ఈ కొబ్బరి టెంకపై ఉండే ఫైబర్‌తో ఏకంగా టీ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదట. కొన్ని వ్యాధులను దూరం ఉంచుతుందని చెబుతున్నారు. ఇక కొబ్బరి టెంకలు చిన్న పక్షులకు గూళ్లలా పనికొస్తాయి. కొబ్బరి పీచుతో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పాత్రలు శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు. ఇక హిందు సంప్రదాయంలో కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయ కొట్టి లక్షీదేవతను ఇంటిలోకి ఆహ్వానిస్తే ఇంట్లో సంపద పెరుగుతుందని హిందువులు విశ్వసిస్తారు. పూర్వం వైద్యులు కొబ్బరి టెంకను కాల్చేవారట. దీంతో పళ్లపొడిని తయారు చేసేవారని చెబుతారు. అంతేకాదు ఏమైనా గాయాలు ఉంటే వాటిని తగ్గించేందుకు ఆయింట్‌మెంట్‌ను ఈ కొబ్బరి టెంకనుంచి తయారు చేసేవారు. ఇక కొబ్బరి చెట్టుకుంటే పొడవైన ఆకులు ఇళ్లల్లో ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతుంది.
కొబ్బరిపాలను కూడా చర్మసౌందర్యం కోసం వినియోగిస్తారు. ఇక కొబ్బరికాయ ఎండిన తర్వాత లేదా తడిగా ఉన్న సమయంలోనే ఫేస్ స్క్రబ్‌గా లేదా ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించడం జరగుతుంది. పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి పాలను వంటలో వినియోగిస్తారు. ఇక కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక వంటలు, సౌందర్య ఉత్పత్తులను పక్కనపెడితే... కొబ్బరి పీచులను కాల్చి కొన్ని రకాల పురుగులకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. కొబ్బరి నుంచి మంచి సువాసన వస్తుంది కాబట్టి వీటిని పూజలో కూడా వినియోగిస్తారు.
ఇక కొబ్బరినూనెను చర్మ సౌందర్యం కోసం వినియోగించొచ్చు. అందులో భాగంగా కొబ్బరి నూనెను లిప్ బామ్‌గా, ఐ మేకప్‌ను తొలగించేందుకు, మోచేతులను, మోకాళ్లకు మాయిశ్చరైజర్‌గా వినియోగించొచ్చని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. ఇక శరీరంపై ఏర్పడే నల్ల మచ్చలను, హైపర్ పిగ్మెంటేషన్, యాంటీ ఏజింగ్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వెంట్రుకలు రాలుతున్నా, చుండ్రు, లాంటి సమస్యలకు కొబ్బరి నూనె చక్కటి పరిష్కారం చూపుతుంది. వెంట్రుకలు చాలా ధృడంగా ఉండటంలో కొబ్బరినూనె సహాయపడుతుంది.
ఇక ఆరోగ్య విషయానికొస్తే కొబ్బరికాయలో లారిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినెరల్స్, విటమిన్లు ఎంతో మేలు చేస్తాయి. లారిక్ ఆమ్లం పలు వైరస్‌లను అణచివేస్తుంది. అంతేకాదు కొవ్వును కూడా కరిగిస్తుంది. దీంతో గుండెసంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. కొబ్బరికాయల్లో మెగ్నీషియం, సెలీనియం, ఐరన్, కాపర్ లాంటి పోషకాలు ఉన్నాయి. ఇవ్వన్నీ శరీరంలోని క్రొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.
అందుకే పూర్వకాలం నుంచే కొబ్బరికాయను ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారు. అప్పటి నుంచే చర్మ సౌందర్యం కోసం, అదే సమయంలో కొబ్బరి చెట్టు నుంచి తయారయ్యే ఇతర ఉత్పత్తులను కూడా చాలా విరివిగా వాడతారు.












Click it and Unblock the Notifications