చైనాలో బాంబుల్లా పేలుతున్న పుచ్చకాయలు: రసాయనాలే కారణం

అసలే అక్కడి వాతావారణం సాధారణ స్థితి కన్నా చాలా చల్లగా ఉండటం, దీనికి తోడు ఆలస్యంగా పంట నాటడంతో పుచ్చకాయలు బాంబుల్లా మారిపోయాయి. పంట పూర్తిగా చేతికి రాక ముందే పుచ్చకాయలు పగిలిపోతుండటంతో అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. సేంద్రీయ ఎరువులతో చేయాల్సిన సాగును వదలి కృత్రిమ రసాయనాలను వాడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అంటారు ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే, ఎలా చేయాల్సిన పనిని అలాగే చేయాలని, లేకపోతే ఇలాగే జరుగుతుంది మరి.












Click it and Unblock the Notifications