అనకాపల్లికి గోదావరి నీళ్లు-ముహుర్తం ఫిక్స్...! సర్కార్ కీలక ప్రకటన..!
అనకాపల్లి (Anakapalle)కి ఏపీ ప్రభుత్వం (AP Govt) ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మొదటి దశలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. జూన్ లోగా గోదావరి జలాలు అనకాపల్లికి వస్తాయన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు ఇప్పటివరకు 76 శాతం పూర్తయినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు భూములు, ఆస్తులు ఇచ్చిన నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని నిమ్మల వివరించారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులను ఆయన శనివారం నాడు అన్నవరం సమీపంలోని పంపా ఆక్విడెక్టు, తుని మండలం లోని కుమ్మరిలోవ గ్రామం మరియు తదితర ప్రాంతాలలో క్షేత్ర స్థాయి లో పర్యవేక్షించారు. తునిలో ఈ కాల్వ పనులకు సంబంధించిన ఇంజనీరింగ్ నిపుణులు, అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జగన్ పాలనకు అలవాటు పడ్డ అధికార యంత్రాంగం తమ తీరు మార్చుకోవాలని,గడువు లోపల పనులు పూర్తిచేయాలని హెచ్చరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి ప్రాధాన్యంగా పోలవరం ప్రాజెక్టుకు వెళ్లారు. తర్వాత అనకాపల్లికి వచ్చి పోలవరం ఎడమ కాలువ పనులు సందర్శించి జూన్ లోగా పనులు పూర్తి చేయాలని గడువు పెట్టారు. ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో గోదావరి జలాలు ఎంతో కీలక మైనవిగా స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కు గోదావరి జలాలు తరలించడానికి, పోలవరం ఎడమ ప్రధాన కాలువే ఆధారం కనుక ఫస్ట్ పేజ్ పూర్తి చేయడం ఎంతో కీలకమని అధికార యంత్రాంగానికి మంత్రి తెలిపారు. అనకాపల్లి కేంద్రంగా వస్తున్న భారీ పరిశ్రమలకు సైతం నీటి సమస్య లేకుండా గోదావరి జలాలు అందిస్తా మన్నారు.












Click it and Unblock the Notifications