ఏపీలో మరో వినూత్న పథకం, 56 లక్షల మందికి లబ్ధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుల ఆరోగ్య పరిరక్షణ దిశగా కూటమి ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, రోగాల ముందస్తు నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో 'సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్' (Citizen Health Screening) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఆమోద ముద్ర వేశారు.

రాష్ట్రంలో వివిధ జబ్బుల బారిన పడిన వారు, భవిష్యత్తులో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నవారు (NCD సర్వే ఆధారంగా), సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులతో కలిపి మొత్తం ఏడాదికి 56.40 లక్షల మందికి ఈ సేవలు అందనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.162.72 కోట్ల వ్యయాన్ని భరించనుంది. 104 సంచార వైద్య వాహనాల (MMUs) ద్వారా ప్రతి గుర్తించిన వ్యక్తికీ 47 రకాల సమగ్ర వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు.

AP Health Revolution CM Chandrababu Naidu Approves 47 Free Medical Tests via 104 Services for 56 Lakh Citizens

పాత పద్ధతికి స్వస్తి.. నూతన విధానానికి నాంది

ఇప్పటివరకు 15 రోజులకోసారి నిర్వహించే 104 సేవల్లో కేవలం 6 రకాల ప్రాథమిక పరీక్షలు మాత్రమే జరిగేవి. అవి కూడా ఖచ్చితత్వం తక్కువగా ఉండే 'ర్యాపిడ్ కిట్స్' ద్వారా చేసేవారు. కానీ ఇకపై సెమీ ఆటోమేటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్లు వంటి అధునాతన పరికరాల ద్వారా కింద పేర్కొన్న 47 రకాల సమగ్ర పరీక్షలు చేస్తారు..

  • కాలేయ పరీక్షలు (LFT): 8 రకాలు.
  • మూత్ర విశ్లేషణ: 6 రకాలు.
  • కొవ్వు పరీక్షలు (Lipid Profile): 5 రకాలు.
  • రక్త కణాల కౌంట్: తెల్ల రక్త కణాలు (5), ఎర్ర రక్త కణాలు (5).
  • ఎలక్ట్రోలైట్ - కిడ్నీ పరీక్షలు: ఎలక్ట్రోలైట్ (4), మూత్రపిండాల పరీక్షలు (RFT - 3).
  • ఇతర పరీక్షలు: గ్లూకోజ్ (3), బ్లడ్ క్లాటింగ్ (2), ఇన్ఫెక్షన్ నిర్ధారణ (ESR - 1) తో పాటు మరో 5 రకాల పరీక్షలు నిర్వహిస్తారు.

డిజిటల్ హెల్త్ రికార్డులు.. సంజీవని రక్షణ

ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రతి వ్యక్తికీ 'డిసీజ్ ప్రొఫైల్' మరియు 'ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు'లను రూపొందిస్తారు. 'సంజీవని' పథకం కింద వ్యక్తులకు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, భవిష్యత్తులో రోగాల నివారణకు చేయాల్సిన సూచనలను నిపుణులు అందిస్తారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఇదొక అత్యంత కీలకమైన అడుగు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

నిర్వహణ - గడువు

మొదటి దశలో ఐదేళ్ల కాలపరిమితితో ఈ పథకం అమలవుతుంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్లే తమ స్వంత ఖర్చుతో వాహనాల్లో సెమీ ఆటోమెటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సిబిసి మెషీన్, మైక్రోస్కోప్ వంటి పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి వాహనం రోజుకు 20 మంది చొప్పున, నెలకు 26 పనిదినాలలో మొత్తం 520 మందికి ఈ 47 రకాల పరీక్షలను పూర్తి చేయాలి. ఈ సమగ్ర ఆరోగ్య తనిఖీల సేవలను వచ్చే రెండు నెలల్లోనే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+