ఆ కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ..?? సంక్షోభం వేళ గుడ్ న్యూస్..??
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం ముదురుతోంది. ఇరాన్ శాంతి చర్చలకు రాకుండా కాలయాపన చేస్తున్న నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై మరోసారి దాడులు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ప్రపంచ దేశాలు మరింత నష్టాల్ని చవిచూడనున్నాయి. పశ్చిమాసియా యుద్ధ సెగలు ప్రపంచ దేశాలతోపాటుగా భారత్ నూ తాకాయి. భారత్ లో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. అయితే భారత్ లో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభంపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) కీలక వార్నింగ్ ఇచ్చింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఇంధన ధరలపై గరిష్ట పరిమితులు లేదా అందరికీ వర్తించే సాధారణ సబ్సిడీలను ఇవ్వొద్దని ప్రభుత్వాలను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) హెచ్చరించింది. భారత్.. తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ముడిచమురు ధరలు పెరిగి భారత్ కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా, లాజిస్టిక్స్, ఆహార ధరలు పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. అయితే దీనిని అడ్డుకోవడానికి సరిగ్గా ప్లాన్ చేయని సబ్సిడీలు ఇస్తే అది దేశ ఆర్థిక లోటును, ప్రభుత్వ అప్పులను మరింత పెంచుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. అలాగే ఇలాంటి సబ్సిడీల వల్ల పేదల కంటే ధనికులకే ఎక్కువ లాభం జరుగుతుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. అందరికీ ఇంధన సబ్సిడీలు ఇవ్వడానికి లేదా పన్నులు తగ్గించడానికి బదులుగా కేవలం పేద కుటుంబాలకు, చిన్న వ్యాపారులకు ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాల ద్వారా లక్షిత నగదు బదిలీ లేదా తాత్కాలియ సాయాన్ని అందించాలని ఐఎంఎఫ్ సిఫార్సు చేసింది.












Click it and Unblock the Notifications