హైదరాబాద్ మెట్రో రైల్ కు కేంద్రం నుంచి భారీ నిధులు

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ రికవరీ నిధుల విడుదలలో కీలకమైన మొదటి అడుగు పడింది. దేశ రాజధానిలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా చర్యలు చేపట్టారు. తెలంగాణకే చెందిన కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం అయ్యారు. హైదరాబాద్ లో మెట్రో రైల్ ఫేస్ 2 విస్తరణకు సంబందించిన నిధుల గురించి చర్చించారు.

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి అందాల్సిన రూ. 13,600 కోట్ల ఐఆర్‌ఎఫ్‌సీ రుణాన్ని త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. దీంతో పాటు ఎల్ అండీ టీ నుంచి మెట్రో మొదటి దశ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వీకరించేందుకు వీలుగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించడంపై చర్చించారు. హైదరాబాద్ నగర మౌలిక వసతులకు ఈ మెట్రో ప్రాజెక్టు అత్యంత విలువైందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth Reddy and Union Minister Kishan Reddy Push for Central Funds for Hyderabad Metro Phase 2

గత తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం సమగ్రంగా లేకపోవడం వల్లే రుణాల పంపిణీ నిలిచిపోయిందని అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వివరించారు. మెట్రో నిధుల రీపేమెంట్ విధానంలో మార్పులు చేయాలని సూచించారు. గత ప్రతిపాదనల ప్రకారం.. మెట్రో టిక్కెట్ల ప్రయాణ ఛార్జీలు, అడ్వర్టయిజ్మెంట్లు, రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తొలుత నిర్వహణ ఖర్చులకు ఉపయోగించి, ఆ తర్వాతే రుణాన్ని చెల్లించాలని ప్రతిపాదించారు.

మెట్రో రైల్ ద్వారా వచ్చే ఆదాయంలో ఐఆర్‌ఎఫ్‌సీ రుణాల చెల్లింపులకే మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలని, ఆ తర్వాతి మొత్తాన్నే నిర్వహణ అవసరాలకు ఉపయోగించాల్సి ఉంటుందని అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా అవగాహన ఒప్పందంలోని నిబంధనలను సవరించి.. మరింత మెరుగైన రీతిలో నూతన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో నిధుల విడుదలకు మార్గం సుగమం అయినట్లయింది.

మెట్రో రెండవ దశ ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యవసర అనుమతులను, అవసరమైన ఆర్థిక సహాయాన్ని సాధించడమే తదుపరి లక్ష్యంగా రాష్ట్ర యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ పర్యటనలో ఫేజ్-2 అనుమతులకు అవసరమైన అన్ని పత్రాలను ఆయనకు అందజేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+