పిడుగులు కురిపించిన మెస్సీ- మాస్ ప్లే: నాకౌట్స్ లో ఎంట్రీ

ఫిఫా ప్రపంచకప్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ప్రతిష్టాత్మక మెగా టోర్నమెంట్‌లో విజయ పరంపరను కొనసాగిస్తోంది. సగర్వంగా ముందడుగు వేసింది. అమెరికా డల్లాస్ స్టేడియం వేదికగా ఆస్ట్రియాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో గ్రూప్-జే నుంచి అర్జెంటీనా జట్టు అధికారికంగా రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ దశకు అర్హత సాధించింది. కెప్టెన్ లియోనెల్ మెస్సి తన అసాధారణ ఆటతీరుతో రెండు కీలక గోల్స్ చేసి జట్టును ముందుండి నడిపించాడు.

ఈ మ్యాచ్ ఆరంభంలోనే మైదానంలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే పెనాల్టీ బాక్స్‌లో అర్జెంటీనా ఆటగాడు లౌటారో మార్టినెజ్‌ను ప్రత్యర్థి డిఫెండర్ కిందపడేయడంతో రెఫరీ వీఏఆర్ సమీక్ష జరిపి అర్జెంటీనాకు పెనాల్టీ ఇచ్చాడు. ఈ పెనాల్టీ కిక్ ను గోల్ పోస్ట్ లోకి నెట్టే అవకాశాన్ని మెస్సీ తీసుకున్నాడు గానీ విఫలం అయ్యాడు. ఊహించని విధంగా మెస్సి కొట్టిన ఈ కిక్ గోల్ పోస్ట్‌కు వెలుపలికి వెళ్లింది. దీంతో స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. దిగ్భ్రాంతికి గురైంది.

Lionel Messi Makes It Count Twice as Argentina Beat Austria 2-0 and Reach Knockouts FIFA World Cup

అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు మెస్సీ. నిమిషాల్లోనే కమ్ బ్యాక్ ఇచ్చాడు. మ్యాచ్ 30వ నిమిషంలో ఫాకుండో మెడినా అందించిన అద్భుతమైన పాస్‌ను చక్కని గోల్‌గా మలిచి అర్జెంటీనాకు తొలి పాయింట్ అందించాడు. అక్కడితో అతని జోరు ఆగలేదు. ద్వితీయార్ధంలో ఆస్ట్రియా డిఫెండర్లు అర్జెంటీనాను గట్టిగానే నిలువరించినప్పటికీ, మ్యాచ్ ముగింపు దశలో మెస్సి తన మాస్ ప్లేని ప్రదర్శించాడు.

మ్యాచ్ ఇంజూరీ టైమ్‌లో అంటే ఆట 95వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ అందించిన పాస్‌ను స్వీకరించిన మెస్సి.. ముగ్గురు డిఫెండర్ల మధ్య నుంచి బంతిని ప్రత్యర్థి గోల్ పోస్ట్ కు చేరుకున్నాడు. గోల్ కీపర్‌ను బురిడి కొట్టిస్తూ సాధించిన ఈ గోల్ మ్యాచ్ కే హైలైట్. దీంతో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సాధించిన ఈ రెండు గోల్స్ ద్వారా మెస్సి ప్రస్తుత టోర్నమెంట్‌లో తన అయిదో గోల్ నమోదు చేశాడు. మెస్సీ ఓవరాల్ ఫిఫా వరల్డ్ కప్ కెరీర్ గోల్స్ సంఖ్య 18 కి పెరిగింది.

ఈ చారిత్రాత్మక గోల్‌తో లియోనెల్ మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు. ప్రపంచకప్ వేదికపై అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా బ్రెజిల్ విమెన్ ఫుట్ బాలర్ మార్టా పేరిట ఉన్న రికార్డును మెస్సి బద్దలు కొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో గ్రూప్-జే పట్టికలో అర్జెంటీనా ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, గ్రూప్‌లో తొలి మ్యాచ్ గెలిచిన ఆస్ట్రియా మూడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్-జే టాపర్‌గా నిలిచిన అర్జెంటీనా తన తదుపరి మ్యాచ్ లో గ్రూప్-హెచ్ రన్నరప్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జూలై 3న మయామిలో జరగనుంది. ప్రస్తుతం అమెరికా క్లబ్ ఇంటర్ మయామి తరఫున ఆడుతున్న మెస్సికి ఈ క్రీడా ప్రాంగణం తన హోమ్ గ్రౌండ్‌ లాంటిదే. ఆ సమరంలో భాగంగా స్పెయిన్, ఉరుగ్వే లేదా సౌదీ అరేబియా వంటి బలమైన ప్రత్యర్థులతో తలపడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+