సూపర్ టేస్టీ 'మెంతి టమాటా పచ్చడి'.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి..!
మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. మెంతికూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది మెంతికూరతో పప్పు, టామాటా వేసి కర్రీ చేసుకుంటారు. మరి మెంతికూరతో టమాటా పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా..? మెంతికూర టమాటా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇది చేస్తే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సూపర్ టేస్టీ మెంతి టమాటా పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
మెంతి టమాటా పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే మెంతి ఆకులు ఒక కప్పు, టమాటాలు రెండు పెద్దవి, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజంత, వెల్లుల్లి రెబ్బలు నాలుగు లేదా ఐదు, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె రెండు టీ స్పూన్లు, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి రెండు, కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి.

ఇక మెంతి టమాటా పచ్చడి తయారీ విధానం చూస్తే ముందుగా బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మెంతి ఆకులు, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి అది మెత్తబడేంత వరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లారనిచ్చి, వెల్లుల్లితో కలిపి మిక్సీలో గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత చట్నీ పై తిరగమోత వేసి బాగా కలపాలి. అంతే సూపర్ టేస్టీ మెంతి టమాటా పచ్చడి రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications