గ్యాస్ ప్లాంట్ పేలుడు.. 12 మంది భారతీయులు దుర్మరణం!
గల్ఫ్ దేశమైన ఖతార్ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రాస్ లఫాన్' లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) కాంప్లెక్స్‌లో ఆదివారం సాయంత్రం ఓ భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం రాత్రి అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఘోర ప్రమాదంలో 13 మంది కార్మికులు మరణించగా.. వారిలో 12 మంది భారతీయ పౌరులే ఉన్నారని ఖతార్ అధికారులు వెల్లడించినట్లు ఎంబసీ స్పష్టం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు భారత రాయబార కార్యాలయం తన గాఢ సంతాపం ప్రకటించింది
అంతకుముందు సోమవారం ఉదయం ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్ కాబీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన 13 మంది కార్మికులు మరణించారని, మరో 66 మంది గాయపడ్డారని ప్రకటించారు. అయితే అప్పటికే భారతీయులు ఎంతమంది చనిపోయారనే ఖచ్చితమైన సంఖ్యను ఆయన వెల్లడించలేదు. తాజాగా ఖతార్ అధికారులు ఇచ్చిన సమాచారంతో మృతుల్లో అత్యధికులు భారతీయులేనని తేలింది. గాయపడిన 66 మందికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. బర్జన్ స్థానిక గ్యాస్ సరఫరా కేంద్రంలో జరిగిన ఈ ఘటనను అధికారులు సాంకేతిక ప్రమాదంగా అభివర్ణించారు.

ఇదిలా ఉండగా.. గత మార్చి నెలలో ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడి కారణంగా ఈ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నష్టం నుంచి కోలుకుని ప్లాంట్‌ను పునరుద్ధరించి తిరిగి పనులు ప్రారంభిస్తున్న తరుణంలో ఈ ఊహించని సాంకేతిక ప్రమాదం చోటుచేసుకుంది. బర్జన్ స్థానిక గ్యాస్ సరఫరా కేంద్రంలో జరిగిన ఈ పేలుడు కేవలం ఓ ప్రమాదం మాత్రమేనని.. దీని వెనుక ఎలాంటి కుట్ర గానీ.. శత్రుదేశాల ప్రమేయం గానీ లేదని ఇంధన మంత్రి సాద్ అల్ కాబీ స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రమాదం వల్ల ప్రపంచ దేశాలకు జరిగే గ్యాస్ ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగలేదని ఖతార్ ఎనర్జీ సంస్థ వెల్లడించింది.
Qatari authorities have confirmed that 12 Indian nationals have unfortunately passed away in the Ras Laffan incident yesterday night. We extend our deepest condolences to the bereaved families and prayers for the departed souls.
— India in Qatar (@IndEmbDoha) June 22, 2026
Qatari authorities have also confirmed that all…
ఈ బర్జన్ ప్లాంట్ రోజుకు దాదాపు 1.4 బిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ అడుగుల గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యంతో ఖతార్ దేశీయ విద్యుత్ అవసరాలను, నీటి శుద్ధి ప్లాంట్లను నడుపుతోంది. ఇంతటి కీలకమైన ప్లాంట్ లోపల ఏ విభాగంలో పేలుడు సంభవించిందనే వివరాలను ఖతార్ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు కానీ.. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన 12 మంది భారతీయ కార్మికులు ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం వారి స్వగ్రామాల్లో తీవ్ర శోకసముద్రాన్ని నింపింది.
⚡️QatarEnergy:
— Warfare Analysis (@warfareanalysis) June 21, 2026
“We confirm that an operational incident occurred during the commencement of operations in Ras Laffan Industrial City, resulting in an explosion and fire at a plant”.
-Ras Laffan was previously attacked by Iran during its war against the US and its Gulf allies,… pic.twitter.com/md2nUn4Yx2












Click it and Unblock the Notifications