Mbappe.. హి డిడ్ ఇట్ అగైన్

ఫిఫా వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ ముందంజ వేసింది. గ్రూప్-ఐలో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఇరాక్‌ను చిత్తు చేసింది. 3-0 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. అమెరికా ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన ఈ పోరులో కెప్టెన్ కిలియన్ ఎంబాపె తడాఖా చూపాడు. నూతన మైలురాయిని అందుకున్నాడు. ఇది అతని కెరీర్‌లో 100వ అంతర్జాతీయ మ్యాచ్. ఇందులో ఏకంగా రెండు గోల్స్ సాధించి చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.

తీవ్ర ప్రతికూల వాతావరణం మధ్య సాగిందీ మ్యాచ్. ఏకంగా నాలుగు గంటల పాటు సాగింది. మొదటి అర్ధభాగంలో వర్షం కురుసింది. విరామ సమయంలో స్టేడియం పరిసరాల్లో భారీ పిడుగులు పడ్డాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు 1: 40 నిమిషాల సుదీర్ఘ విరామం అనంతరం మ్యాచ్ పునఃప్రారంభమైంది.

Mbappe Marks 100th International Appearance as France Secure Commanding Win on Iraq 3-0 in FIFA

భద్రతా ప్రమాణాలు సమీక్షించిన అనంతరం ఫిఫా ఆటను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. ఈ వరల్డ్ కప్ లో వాతావరణం కారణంగా ఓ మ్యాచ్ నిలిచిపోవడం మొదటిసారి. మ్యాచ్ ఆరంభం నుంచే ఫ్రాన్స్ తన దూకుడును ప్రదర్శించింది. ఆట 14వ నిమిషంలో వింగర్ మైఖేల్ ఒలిసే అందించిన అద్భుతమైన పాస్‌ను అందుకున్న కెప్టెన్ ఎంబాపె, లెఫ్ట్ ఫుట్‌తో కొట్టిన శక్తిమంతమైన షాట్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది.

ఈ గోల్‌తో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ (15) చేసిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజం రొనాల్డో సరసన ఎంబాపె చేరాడు. అలాగే టోర్నీ చరిత్రలోనే మూడో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మూడోస్థానంలో నిలిచాడు. వర్షం అంతరాయం అనంతరం ప్రారంభమైన రెండో అర్ధభాగంలో కూడా ఫ్రాన్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. పట్టువదలకుండా ఇరాక్ డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టిన ఫ్రాన్స్.. 53వ నిమిషంలో రెండో గోల్ సాధించింది.

ప్రత్యర్థి డిఫెండర్ల కదలికలను ముందే పసిగట్టిన ఎంబాపె, క్లోజ్ రేంజ్ నుంచి బంతిని గోల్ పోస్ట్‌కు పంపి మ్యాచ్‌లో తన రెండో గోల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత గోల్స్ అంతరం మరింత పెరిగింది. ఆట 65వ నిమిషంలో ఫ్రాన్స్ మూడో గోల్‌ను నమోదు చేసింది. మైఖేల్ ఒలిసే అందించిన అద్భుతమైన త్రూ బాల్‌తో వింగర్ ఉస్మానే డెంబెలే బాక్స్ మధ్యలో నుంచి రైట్ ఫుట్ షాట్‌తో బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో ఫ్రాన్స్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లి పూర్తి నియంత్రణ సాధించింది.

ఈ మ్యాచ్‌లో మైఖేల్ ఒలిసే రెండు గోల్స్ అసిస్ట్‌లతో జట్టు విజయానికి పునాది వేశాడు. మరోవైపు మ్యాచ్ ముగిసే సమయానికి కనీసం ఒక్క గోల్ అయినా కొట్టాలని ఇరాక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 74వ నిమిషంలో లభించిన సువర్ణావకాశాన్ని ఇరాక్ ఆటగాడు అలీ అల్ హమాది చేజార్చుకున్నాడు. ఫ్రాన్స్ డిఫెన్స్ విభాగం చివరి నిమిషం వరకు ఏకాగ్రత కోల్పోకుండా ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా దక్కకుండా గట్టి రక్షణ కవచంలా నిలిచింది. దీంతో ఇరాక్ జట్టుపై ఫ్రాన్స్ క్లీన్ షీట్‌ను సాధించగలిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+