మంచు మనోజ్ 'డేవిడ్ రెడ్డి' టీజర్ రిలీజ్.. అరాచకం బాబోయ్..
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా సినిమా 'డేవిడ్ రెడ్డి' టీజర్ రిలీజ్ అయింది. మే 20 మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతంగా, ఉత్కంఠభరితంగా ఉంది. డేవిడ్ రెడ్డి క్యారెక్టర్ బ్రిటిష్ అధికారులను వణికిస్తోంది. స్వాతంత్రోద్యమం సమయంలో జరిగిన సంఘటనలతో డేవిడ్ రెడ్డి కథను దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి సిద్ధం చేసినట్లు స్పష్టం అవుతోంది. బ్రిటిష్ ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ గా డేవిడ్ రెడ్డి నట విశ్వరూపం ప్రదర్శించాడు.

టీజర్ లో ఏ మ్యాన్ విత్ ఏ కరేజ్.. గాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు.. అనే డైలాగ్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. బ్రిటిష్ సైన్యాన్ని మంచు మనోజ్ కసితీరా నరుకుతున్న దృశ్యాలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. టీజర్ మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. ఇక డేవిడ్ రెడ్డి మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి. ఈ మూవీ 1897 నుంచి 1922 మధ్య కాలంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.
డేవిడ్ రెడ్డి చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై భరత్ మోతుకూరి, వెంకట్ రెడ్డి నల్లాగంగుల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా ఉక్రెయిన్ నటి మరియా రియా బోషప్కా నటిస్తోంది. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ మూవీకి ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications