షాకింగ్ న్యూస్: పట్టాలు తప్పిన మరో రైలు..

తమిళనాడులోని విల్లుపురం వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. లోకో పైలట్ గమనించి వెంటనే రైలును నిలిపివేశాడు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ రూట్ లోని ఇతర రైలు సర్వీసులు నిలిచిపోయాయి. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తున్న రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తమిళనాడుకు నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.

గతేడాది సైతం విల్లుపురం ప్రాంతంలో ఓ మెము ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విల్లుపురం నుంచి పుదుచ్చేరి వెళ్తున్న మెము రైలు విల్లుపురం సమీపంలో పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలులో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.

అయితే ఇటీవల రైలు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. కారణం ఏదైనా ఇలాంటి ఘటనల వల్ల ప్రయాణికులు రైలు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. మన దేశంలో నిత్యం వేలమంది రైలు ప్రయాణాలే చేస్తుంటారు. తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు చేరుకోవడంలో రైలు ప్రయాణం మేలని ప్రజలు భావిస్తుంటారు. కానీ ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళనల్ని పెంచుతున్నాయి.

Villupuram Railway Accident Goods Train Derails Tamil Nadu Teams Rushed to the Spot for Clearance

ఇటీవల రాజధాని ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాట్నా ఫాస్ట్ పాసింజర్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే తాజాగా ఉజ్జయినీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి రైలును రైల్వే యార్డుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇక తాజాగా విల్లుపురంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు రైలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+