అప్పటి వరకు పెట్రోల్, డీజిల్ పరిస్థితి అంతే - సగానికి పైగా బంకుల మూసివేత..!!

పెట్రోల్‌, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. గత కొన్ని రోజులుగా మొదలైన ఈ కొరత శని, ఆదివారాల్లో తీవ్రమైంది. ఇంధన కొరతతో రాష్ట్రంలో అనేకచోట్ల పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల బంకులు మూతపడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సీఎం చంద్రబాబు పరిస్థితి సమీక్షించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇంకా పరిస్థితి మెరుగుపడలేదు. సరఫరా మెరుగుదల పైన ఆయిల్ కంపెనీల అధికారులు స్పష్టత ఇస్తున్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ , డీజిల్ కు కొరత కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూసివేసారు. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్‌ ఉన్నచోట కూడా పరిమితంగానే విక్రయాలు జరిగాయి. కొన్నిచోట్ల లారీకి రూ.5 వేలు, ట్రాక్టర్‌కు రూ.1,500, స్కూటర్‌కు రూ.200 చొప్పున ఇంధనం నింపుతామని బంకులు బోర్డులు పెట్టాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఆయిల్‌ కంపెనీల నుంచి బంకులకు సరఫరా రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. స్టాక్‌ అందుబాటులోనే ఉందని, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల నుంచి సరఫరా తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సరఫరా పెంచాలని ఆయిల్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశామని, సోమవారం సాయంత్రం నాటికి సాధారణ పరిస్థితికి చేరుకుంటుందని చెప్పారు. సరఫరా తగ్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా 421 బంకులు మూతపడ్డాయని ప్రభుత్వం చెబుతుంటే పెట్రోల్‌ బంకు ఓనర్స్‌ అసోసియేషన్‌ మాత్రం సుమారు 1,500 వరకు మూతపడ్డాయని చెబుతోంది. ఇంధన కొరత వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు- భారీగా క్యూ లైన్లు..!!
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు- భారీగా క్యూ లైన్లు..!!
petrol-and-diesel-shortage-across-andhra-pradesh-worsened-despite-cm-chandra-babu-directive-to-offi

చంద్రబాబు సమీక్ష... కీలక ఆదేశాలు

ఈ పరిస్థితులు వల్ల నాలుగు రోజుల్లో చేరాల్సిన సరుకు రవాణా లారీలు 6 రోజులకు చేరుతున్నా యని ఎపి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరయ్య తెలిపారు. ఈ పరిస్థితి పై సీఎం చంద్రబాబు సమీక్ష చేసారు. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండేలా, సోమవారంలోగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను, ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కంపెనీలు రిటైల్‌ ఔట్‌ లెట్ల మధ్య గ్యాప్‌ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆయిల్‌ కంపెనీల అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే సహించేది లేదన్నారు. గురువారమే సమస్యను గుర్తించామని ముఖ్యమంత్రితో అధికారులు చెప్పగా.. అప్పుడే పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రైతులకు కూపన్‌ విధానం ప్రవేశపెట్టే ఆలోచన కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు చేయాలని సూచించారు. ప్రతి బంకు దగ్గర రెవెన్యూ, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుతోపాటు సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+