ఇండియన్లు తెగ వాడేస్తున్న టాప్ 5 ఏఐ టూల్స్ ఇవే!
భారతదేశంలో ఏఐ విప్లవం కొనసాగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఏఐ మీద ఆధారపడిన వారి పెరిగిపోతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, డిజైనర్లు అందరూ రోజువారీ పనుల్లో AIని ఉపయోగిస్తున్నారు. మరి ఇంతగా ఏఐ వినియోగం పెరిగిన వేళ భారతీయులు ఎక్కువగా వాడుతున్న టాప్ 5 ఏఐ టూల్స్ ఏంటి అనేది చూద్దాం.
చాట్ జిపిటి (ఓపెన్ ఏఐ)
భారతదేశంలో అత్యంత ప్రముఖ AI టూల్. కంటెంట్ రాయడం, కోడింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, భాషా అనువాదం, ఆలోచనలు షేర్ చేయడం వంటివి చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది చాట్ జిపిటి. మిలియన్ల మంది భారతీయులు రోజూ ఉపయోగిస్తున్నారు. చాట్ జిపిటి ప్లస్ వెర్షన్‌తో మరిన్ని అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

గూగుల్ జెమిని
గూగుల్ యొక్క శక్తివంతమైన AI గూగుల్ జెమినై. Gmail, Docs, Sheets, Androidతో ఇంటిగ్రేట్ అవుతుంది. హిందీ, తెలుగు సహా భారతీయ భాషల్లో మంచి సపోర్ట్ ఉంది. రీసెర్చ్, సమ్మరీలు, ఇమేజ్ జెనరేషన్ కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఉచితంగా ఎక్కువ ఫీచర్లు ఇస్తుంది.
కాన్వా
డిజైన్ లేకుండానే అద్భుతమైన పోస్టర్లు, సోషల్ మీడియా ఇమేజెస్, లోగోలు తయారు చేస్తుంది కాన్యా ఏఐ. భారతీయ ఎంట్రప్రెన్యూర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, స్టూడెంట్స్‌లో భారీగా పాపులర్ గా ఈ టూల్ ఉంది . దీంతో పని చాలా సులభం మరియు ఉచిత ఆప్షన్లు ఉన్నాయి.
క్లాడ్
రాతపూర్వక పనులు, కోడింగ్, లాంగ్ డాక్యుమెంట్స్ అనాలిసిస్‌కు అత్యుత్తమంగా పనిచేస్తుంది క్లాడ్ ఏఐ. ChatGPT కంటే కొన్ని సందర్భాల్లో మెరుగ్గా పని చేస్తుందని యూజర్లు చెప్తున్నారు. ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఇష్టపడతారు. దీనిలో చాలా ఫీచర్లు ఉన్నా ఉచితంగా మాత్రం కొంత వరకే వీలు ఉంటుంది.
గ్రోక్
ఇది చాట్ జిపిటి లానే పనిచేసే ఏ ఐ టూల్. కంటెంట్ రాయడానికి, కోడింగ్ కు, ఇంటర్వ్యూలకు, ఆలోచనలు షేర్ చేయడానికి ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. దీంతో తెలుగులో కూడా మాట్లాడవచ్చు. ఇది ఫోటోలు చూసి ఏంటో చెప్పగలదు. కొత్త ఫోటోలు అడిగిన వాటిని సృష్టించగలదు. ఇది చాట్ జిపిటి లానే సరదాగా నిజాయితీగా మాట్లాడే ఏఐ.
ఏఐ టూల్స్ వాడే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఇదే
అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఏ ఏఐ టూల్ వాడినప్పటికీ మనం ఖచ్చితమైన ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు, అవి అంతే కచ్చితంగా మనకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వగలవు. అయితే పని ఈజీ అవుతుందని పూర్తిగా ఏఐ టూల్స్ పై ఆధారపడడం మంచిది కాదు. ఏ పనిలో అయినా సరే మన మెదడుకు కూడా పదును పెట్టాల్సిన అవసరం ఉంది.













Click it and Unblock the Notifications