మేడ్ ఇన్ ఆంధ్రా.. భారత్ డిఫెన్స్ రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర !!

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దక్కింది. దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఐదవ తరం యుద్ధ విమానం 'అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' (AMCA) కార్యక్రమానికి సంబంధించిన కీలక కేంద్రం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ప్రధాన హబ్‌గా ఎదగబోతోందని నిపుణులు చెబుతున్నారు.

డీఆర్‌డీఓ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక సముదాయం ద్వారా భవిష్యత్తు యుద్ధ విమానాలు, డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థల అసెంబ్లీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ వంటి కీలక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా భారత వైమానిక దళం కోసం రూపొందిస్తున్న AMCA ఫైటర్ జెట్‌కు ఇది ప్రధాన పరీక్షా కేంద్రంగా మారనుంది.

andhra-pradesh-became-topic-for-amca-aircraft-testing-complex-in-puttaparthi-led-by-ada-and-drdo

ఈ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 350 ఎకరాల భూమిని కేటాయించనుంది. ఇందులో 150 ఎకరాలను నేరుగా ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ కోసం వినియోగిస్తారు. మరో 200 ఎకరాల్లో శాటిలైట్ కార్యాలయం, శాస్త్రవేత్తల నివాస సముదాయం, సిబ్బంది కోసం ప్రత్యేక టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నారు.

పుట్టపర్తి ఎయిర్‌స్ట్రిప్‌ను కూడా భారీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రన్‌వేను 10,000 అడుగులకు విస్తరించనున్నారు. అలాగే అధునాతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్, నావిగేషన్ సిస్టమ్స్, వాతావరణ సూచన కేంద్రాలు, భద్రతా సదుపాయాలు వంటి అన్ని ఆధునిక వైమానిక మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల భారీ యుద్ధ విమానాలు కూడా సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలుగుతాయి.

భారత్ స్వదేశీ రక్షణ తయారీలో ఆత్మనిర్భరత సాధించాలనే లక్ష్యంతో AMCA ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీ, అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, AI ఆధారిత యుద్ధ సాంకేతికతలతో రూపొందనుంది. అమెరికా F-35, రష్యా Su-57 వంటి ఫైటర్ జెట్లకు పోటీగా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం AMCA కార్యక్రమం అమలు విధానానికి ఆమోదం తెలిపింది. ఇందులో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి కూడా అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు ప్రముఖ భారతీయ ప్రైవేట్ కంపెనీలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయి. త్వరలోనే షార్ట్‌లిస్ట్ చేసిన సంస్థలకు RFP (Request for Proposal) విడుదల చేయనున్నట్లు రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఇటీవల వెల్లడించారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా పుట్టపర్తి ప్రాంతంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. వందలాది మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. పరోక్షంగా హోటల్స్, రవాణా, నిర్మాణ రంగాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. స్థానిక యువతకు ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో శిక్షణ అవకాశాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే శ్రీహరికోట, విశాఖ నావల్ కేంద్రం వంటి కీలక రక్షణ, అంతరిక్ష సంస్థలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు AMCA టెస్టింగ్ హబ్ రావడం రాష్ట్ర ప్రాధాన్యతను మరింత పెంచింది. ఐటీ, పరిశ్రమల తర్వాత ఇప్పుడు రక్షణ తయారీ రంగంలో కూడా ఏపీ వేగంగా ఎదుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+