"దళపతిని అభిమన్యుడిని చేశారు" -పోసాని ఫైర్- విజయ్ పై భారీ కుట్ర?

తమిళనాడు (tamil nadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ మెజార్టీ నిరూపించుకోవాలని కోరడంపై టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani krishna murali) మండిపడ్డారు. విజయ్ పై భారీ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన పార్టీకి అవకాశం ఇవ్వడం లేదన్నారు.

బీజేపీ ప్లాన్ కు చెక్ పెట్టేసిన విజయ్..! అంత పెద్ద ఆఫర్ కూ నో..!
బీజేపీ ప్లాన్ కు చెక్ పెట్టేసిన విజయ్..! అంత పెద్ద ఆఫర్ కూ నో..!

విజయ్ ది అధికారం కోసం పాకులాడే మనస్తత్వం కాదని పోసాని తెలిపారు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దళపతి అయిన విజయ్ ను అభిమన్యుడిని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. విజయ్ తనకు 1996 నుంచీ తెలుసని, ఆయన తండ్రి చంద్రశేఖర్ తో కూడా తనకు పరిచయం ఉందన్నారు. విజయ్ చుట్టూ ఎన్నో గొడవలు ఉన్నా సంయమనంతో ఉన్నాడన్నారు. అయినా ఆయనపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

Posani Krishna Murali Sees Conspiracy Behind Governor s Decision Against Vijay
విజయ్ అనూహ్య నిర్ణయం..! గవర్నర్ తిరస్కారం వేళ..!
విజయ్ అనూహ్య నిర్ణయం..! గవర్నర్ తిరస్కారం వేళ..!

రాజకీయాల్లో విజయ్ ను ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోసాని ఆరోపించారు. విజయ్ ను అభిమన్యుడిని చేస్తున్నారన్నారు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పెద్ద కుట్రే చేస్తున్నారని, గవర్నర్ కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని పోసాని తెలిపారు. తాను గవర్నర్ ను విమర్శించడం లేదని, అయితే జరుగుతున్న పరిణామాల్ని బట్టి చూస్తే పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+