కాకినాడ-లింగంపల్లి, విశాఖ-చర్లపల్లి రైళ్ల రద్దు- ఈ తేదీల్లో..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ-దువ్వాడ సెక్షన్లో రైల్వే ట్రాక్ మరమ్మత్తులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. వీటి కారణంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో తిరిగే పలు రైళ్లు (trains) రద్దు చేశారు. వివిధ తేదీల్లో రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కాకినాడ, విశాఖ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల మధ్య ప్రయాణించే వారు తప్పకుండా ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నారు.
కాకినాడ టౌన్ (Kakinada)నుంచి లింగంపల్లికి ప్రతీ రోజూ ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12775ను మే 1, 2. 4 తేదీల్లో రద్దు చేశారు. అలాగే లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ కు ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12776ను మే 2, 3, 5 తేదీల్లో రద్దు చేశారు. వీటితో పాటు విశాఖపట్నం-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18527ను మే1న రద్దు చేశారు. అలాగే చర్లపల్లి-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18528ను మే 2వ తేదీన రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే షాలిమార్-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 08045ను మే1న రద్దు చేశారు. దీంతో పాటు చర్లపల్లి-షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 08046ను మే2న రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విజయవాడ-దువ్వాడ సెక్షన్ లో మరమ్మత్తు పనులు పూర్తి కాగానే ఈ రైళ్లను తిరిగి యథావిథిగా నడుపుతారు. రాయనపాడు యార్డ్ రీమోడలింగ్, నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కోసం ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications