"డియర్ బ్రదర్ విజయ్.." జగన్ ట్వీట్..! అయ్యో దీదీ..! బీజేపీకి ఇలా..!

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఇందులో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఉన్నాయి. వీటిలో తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ.. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెలిచాయి. ఈ ఫలితాలపై ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కూడా స్పందిస్తూ ట్వీట్ చేశారు.

ముందుగా వైఎస్ జగన్ తన ట్వీట్ లో తమిళనాడు ఎన్నికల్లో గెలుపు జోష్ లో ఉన్న టీవీకే అధినేత విజయ్ గురించి ప్రస్తావించారు. నా ప్రియ సోదరుడు విజయ్‌కి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు! అని తెలిపారు. మీ మొట్టమొదటి ఎన్నికలోనే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడం అద్భుతం అన్నారు. సేవ అనే ఈ కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభిస్తున్న ఈ తరుణంలో మీకు అపారమైన బలం, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండుగాక అని ఆశీర్వదించారు.

YS Jagan Congratulates Vijay s TVK on Landmark Debut Offers Sympathies to Mamata Hails BJP Victory

మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి.. దీదీ గారికి నా సానుభూతి అని జగన్ తెలిుపారు. అలాగే బీజేపీకి, ఇతరులకు అభినందనలు అంటూ జగన్ ట్వీట్ ముగించారు. బీజేపీకి అంటే సరే ఎప్పటి నుంచో తాను కేంద్రంలో ఎన్డీయేలో లేకపోయినా బహిరంగంగానే మద్దతిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఇతరుల్లోకి వచ్చే కేరళలోని యూడీఎఫ్ విజయాన్ని జగన్ ప్రస్తావించకపోవడం వ్యూహాత్మకమేనా అన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+