Advertisement

మొగులయ్యకు జనసేనాని ఆర్థికసాయం రూ.2 లక్షల చెక్ అందజేత


గిరిజన ప్రాంతాలకే పరిమితమైన కిన్నెర వాయిద్యం.. కానీ దానికి కూడా పేరు వస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని.. వైరల్ చేయడంతో అంతరించిపోతున్న ప్రతిభ వెలికిలోకి వస్తోంది. అద్భుతమైన గానం చేస్తూ రంజింప చేస్తున్న జానపద కళాకారుడు మొగులయ్య. ఆయన భీమ్లా నాయక్ సినిమాలో కిన్నెర స్వరాలను అద్దారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ ఆత్మీయ సత్కారం చేశారు. తన పార్టీ ఆఫీసులో శాలువా కప్పిన పవన్ రూ.2 లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. వన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాలో నటిస్తుండగా, టైటిల్ సాంగ్‌లో మొగులయ్య తన గాత్రాన్ని అందించగా.. దీనికి మంచి స్పందన వచ్చింది.

అమ్రాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతానికి చెందినవారు మొగులయ్య. ఆయనకు పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇటు తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డాక్టర్ దాసరి రంగాను కూడా పవన్ కల్యాణ్ ఆదుకున్నారు. రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు.

Advertisement
Advertisement

మొగులయ్య పీడిత వర్గానికి చెందిన కళాకారుడు. అంతరించిపోతున్న కిన్నెర వాయిద్యాన్ని నమ్ముకున్న జానపద కళాకారుడు.ఫేస్‌బుక్,యూట్యూబులో, టీవీ స్టూడియోలో మొగులయ్య పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణా ప్రభుత్వం సాంస్కృతిక కళాకారులను గౌరవించిన ప్రథమ వర్గంలో ఉన్న కళాకారుడు ఆయనే. కిన్నెర వాయిద్యం కోసం ఒక పాఠాన్ని రూపొందించి విద్యార్థులతో చదివిస్తూ.మోగిలయ్యకు గౌరవం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ బేగంపేట వద్ద వేయబడ్డ గోడ చిత్రాల్లో మొగిలయ్య బొమ్మ అద్భుతంగా కనిపిస్తుంది. ఇదీ ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవమే అని చెప్పాలి.

Afghanistan తాలిబన్ల పాలన.. Mullah Baradar పై India ఆశలు, పాకిస్తాన్ పై ఒత్తిడి || Oneindia Telugu
Advertisement

ఇదివరకు మొగులయ్య కిన్నెర వాయిద్యాన్ని ఆదరించినవారే కరువయ్యారు. ప్రకృతి నేర్పిన సంగీతంతో అణగదొక్కబడ్డ నేపథ్యం నుంచి.. మొగిలయ్య మరోసారి తన గళాన్ని వినిపించారు. సోషల్ మీడియా వల్ల అతనికి మంచి క్రేజ్ ఏర్పడింది. కిన్నెర వాయిద్యం గురించి ప్రపంచానికి తెలిసింది. అతనికి తగిన గుర్తింపు లభించింది. ఇదివరకు ఎందరో కళాకారుల గుర్తింపును నోచుకోలేదు. కానీ క్రమంగా మాత్రం పేరు రావడం శుభపరిణామమే అని చెప్పాల్సి ఉంటుంది.

English Summary

janasena chief pawan kalyan handed cash cheque to kinnera artist mogulaiah today at party office.
Read more...