Tamil Nadu: మీరెట్లా ఓడిపోయారయ్యా..! కొలత్తూర్ లో ఎమోషనల్ సీన్స్..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. డీఎంకే కూటమిని విజయపథాన నడపడంలో విఫలమైన మాజీ సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓడినా తమకు ఓటేసిన జనాన్ని కలిసేందుకు 24 గంటల్లోనే నియోజకవర్గాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు గెలిచిన ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చిన స్టాలిన్.. తాను ఓడిన కొలత్తూర్ నియోజకవర్గానికి వెళ్లారు. వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన కొలత్తూర్ లో ఈసారి టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలైనా స్టాలిన్.. తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Vijay Cabinet: విజయ్ కేబినెట్ లో మంత్రులు వీళ్లే..? ఇద్దరు మహిళలకు చోటు..!
Vijay Cabinet: విజయ్ కేబినెట్ లో మంత్రులు వీళ్లే..? ఇద్దరు మహిళలకు చోటు..!

ఈ సందర్భంగా కొలత్తూరు పర్యటనలో స్టాలిన్ ను చూసి డీఎంకే కార్యకర్తలు కన్నీరు మున్నీరయ్యారు. స్టాలిన్ ఓటమి జీర్ణించుకోలేక మహిళలు (women) ఏడ్చేశారు. ఈ ఫొటోల్ని స్టాలిన్ స్వయంగా ట్వీట్ చేశారు. తనకూ, కొలత్తూరుకు మధ్య ఉన్న బంధం ఎన్నికల గెలుపు ఓటములకు అతీతమైనదని ఆయన తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తనకు మద్దతు ఇస్తున్నది కొలత్తూరు నియోజకవర్గ ప్రజలేనన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 5 సంవత్సరాలు అధికార పక్షంలో తాను కొలత్తూరుకు సాధ్యమైన అన్ని పథకాలను తీసుకువచ్చి అమలు చేశానని గుర్తుచేసుకున్నారు.

MK Stalin s Kolathur Visit Turns Emotional as Women Break Down Following Constituency Defeat
డీఎంకే-కాంగ్రెస్ మధ్య విజయ్ చిచ్చు..! ఇండియా కూటమిలో ప్రకంపనలు..!
డీఎంకే-కాంగ్రెస్ మధ్య విజయ్ చిచ్చు..! ఇండియా కూటమిలో ప్రకంపనలు..!

తమిళనాడులోనే దీనిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, ప్రతి డిమాండ్‌ను నెరవేర్చినందుకు గర్విస్తూ, ఈ రోజు తన కొలత్తూరు నియోజకవర్గ ప్రజలను స్వయంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశానని స్టాలిన్ పేర్కొన్నారు. తాను ప్రతి వీధిలో తిరుగుతూ, అక్కడ తాను నిర్మించిన క్రీడా మైదానాలు, పార్కులు, ముఖ్యమంత్రి గ్రంథాలయాలు, గ్రంథాలయాలు, వివాహ మందిరాలు, బస్ స్టాండ్‌లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు వంటి వాటిని చూస్తుంటే, తన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చాననే ప్రగాఢమైన సంతృప్తి కలిగిందన్నారు. తన కృతజ్ఞతను స్వీకరించిన కొలత్తూరు ప్రజల కోసం తాను ఉప్పొంగే భావోద్వేగాలతో ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తానని, ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని వారికి స్టాలిన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+