ఫుట్‌బాల్ ఆడిన మోదీ .. కొత్త లుక్ లో- యూత్ తో పోటీ పడి గోల్స్..!!
ప్రధాని మోదీ ఒక్కసారిగా ఫుట్ బాల్ ప్లేయర్ అయి పోయారు. యువతతో కలిసి వరుస గోల్స్ చేసి సందడి చేసారు. వరుసగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన ప్రధాని కొత్త లుక్ లో దర్శనం ఇచ్చారు. బెంగాల్ లో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. ఈ రోజు సిక్కిం పర్యటన కు గ్యాంగ్ టక్ చేరుకున్నారు. అక్కడ సరదాగా ప్రధాని ఫుట్ బాల్ ఆడిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిత్యం సమీక్షలు.. సమావేశాలు... రాజకీయాలతో బిజీగా ఉండే ప్రధాని మోదీ కొత్త లుక్ లో సిక్కిం లో కనిపించారు. స్పోర్స్ట్ జర్సీలో యువతతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. సరాదాగా గడిపారు. వారితో కలిసి పోటీ పడి గోల్స్ చేసారు. గ్యాంగ్‌టక్‌లో స్థానిక యువతీ, యువకులు ఫుట్‌బాల్ ఆడుతుండగా అక్కడకు వెళ్లిన మోదీ వారితో కాసేపు మాట్లాడారు. తాను సైతం ఫుట్‌బాల్ ఆడతానని వారితో చెప్పారు. కాసేపట్లోనే స్పోర్ట్స్ జెర్సీ ధరించి వచ్చి ఆటగాళ్లతో సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. గోల్స్ సైతం కొట్టారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బెంగాల్ లో రెండో విడత పోలింగ్ కు సంబంధించిన ప్రచారం సోమవారంతో పూర్తయింది. చివరి రోజున ప్రచారంలో పాల్గొన్న ప్రధాని గెలుపు పైన ధీమా వ్యక్తం చేసారు.

బెంగాల్ ఎన్నికల్లో గెలుపు పై ధీమా
ఇక, వరుసగా అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం పూర్తి కావటంతో.. ఇక రెగ్యులర్ పాలనా వ్యవహా రాల పైన ప్రధాని ఫోకస్ చేసారు. అందులో భాగంగా ఈ రోజు సిక్కిం పర్యటనకు వెళ్లారు. అక్కడ పలు డెవలప్ మెంట్ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపనలు చేస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఈ సారి భారీ అంచనాలతో ఉంది. బెంగాల్ లో గెలిచి తీరుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని సైతం చివరి రోజు ప్రచార సభలో తాను బెంగాల్ నుంచి తిరిగి వెళ్తున్నానని.. మే 4 ఫలితాల తరువాత బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తిరిగి వస్తానని వ్యాఖ్యానించారు. రేపు (బుధవారం) బెంగాల్ లో రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో ప్రధాని మోదీ ఇంత రిలాక్స్ మూడ్ లో స్పోర్ట్స్ జర్సీలో కొత్త లుక్ లో ఫుట్ బాల్ ఆడుతూ కనిపించటం పైన సోషల్ మీడియాలో ఆసక్తి కర పోస్టులు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications