నిన్నొకటి.. నేడొకటి: మంటల్లో రైలు బోగీలు.. బుగ్గి
దేశంలో రైలు ప్రమాదాలు పరిపాటిగా మారిపోయాయి. రెండు రోజుల్లో రెండు రైలు ప్రమాదాలు సంభవించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆదివారం నాడు రాజస్థాన్ లో రాజధాని ఎక్స్ ప్రెస్ మంటల బారిన పడి 24 గంటలు కూడా గడవక ముందే మరో రైలులు ఇటువంటి ప్రమాదమే సంభవించింది. అగ్నికీలలు చెలరేగాయి. మంటలు వ్యాపించాయి. బోగీలను బుగ్గిపాలు చేశాయి.
బీహార్‌లోని ససారాం రైల్వే స్టేషన్‌లో పాట్నా ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక కోచ్ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశావత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పై నిలిచివున్నప్పుడే అగ్నిప్రమాదం సంభవించడం, మంటలను గుర్తించిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగిపోవడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం జరిగిన మరుసటి రోజే ఇది చోటుచేసుకోవడం గమనార్హం.

ససారాం నుండి పాట్నాకు బయలుదేరి వెళ్లాల్సిన ఫాస్ట్ పాసింజర్ అది. ప్లాట్‌ఫారమ్ నంబర్ 6పై నిలిచివున్న ఈ ప్యాసింజర్ కోచ్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, ప్రయాణికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు త్వరితగతిన చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
రైలు కోచ్ లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తోన్నారు. ఈ అగ్నిప్రమాదంతో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. కాలి బూడిదైన బోగీని వేరు చేసిన అనంతరం, మిగిలిన రైలును పాట్నాకు పంపారు.
#WATCH | Sasaram, Bihar: Fire broke out in a coach of the Sasaram-Patna Passenger train. Firefighters have brought the fire under control. No casualties were reported pic.twitter.com/dUpxSUkG1R
— ANI (@ANI) May 18, 2026
ఆదివారం తెల్లవారు జామున తిరువనంతపురం నుండి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న 12431 నంబర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ బీ1 కోచ్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. సకాలంలో మంటలను గుర్తించడంతో ఈ కోచ్‌లో ఉన్న 68 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే పాట్నా ఫాస్ట్ పాసింజర్ ప్రమాదానికి గురి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైల్వే నిర్లక్ష్యపు పనితీరుకు అద్దం పట్టినట్టయింది.












Click it and Unblock the Notifications