తమిళనాడును రూల్ చేసేది మేమే

ఇంకొక్కరోజే మిగిలివుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలో ే పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ కూడా వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నాయి.

ప్రత్యేకించి తమిళనాడు ఫలితాలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయడం దీనికి ప్రధాన కారణం. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చింది. గెలుపోటముల అంతర్యాన్ని తగ్గించడమే కాకుండా, ఫలితాలను తారుమారు చేయగలిగుతుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మేజిక్ ఫిగర్ ను సైతం అందుకోవచ్చని మై యాక్సిన్ ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

TVK Leader Sengottaiyan Predicts 180 to 200 Seats and Vijay set to Rule Tamil Nadu with visionary

ఈ పరిణామాల మధ్య టీవీకే కార్యనిర్వాహక కమిటీ ప్రధాన సమన్వయకర్త కేఏ సెంగోట్టయ్యన్ ఈ ఉదయం ఈరోడ్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ విజయంపై ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. టీవీకే 180 నుండి 200 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ చీఫ్ విజయ్.. రాష్ట్రాన్ని పరిపాలిస్తారని అన్నారు. ఆయన విజనరీ ఆలోచనలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో అతిగొప్ప, చారిత్రాత్మక విజయం సాధిస్తామని సెంగొట్టయ్యన్ అన్నారు.

ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రశ్నించగా సానుకూలంగా స్పందించారాయన. తనకు తెలిసినంతవరకు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించాయని అన్నారు. విజయ్ రూపంలో తమకు ఓ మంచి నాయకుడు దొరికాడని ప్రజలు భావిస్తోన్నారనే విషయాన్ని దాదాపుగా అన్ని సర్వేలు చాలా స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ప్రజల మద్దతు తమ పార్టీకి స్పష్టంగా ఉందని తేల్చి చెప్పారు.

బీజేపీ తమిళనాడు రాష్ట్రశాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన విమర్శలపై సెంగొట్టయ్యన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తీవ్ర విమర్శలు చేశారు. నైనార్ నాగేంద్రన్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేరని అన్నారు. ఆయనకు ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన భవిష్యత్ ఏంటో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+