దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఇటీవలే పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచింది. లీటర్ పై రూ.3.50 పైసల మేర వడ్డించింది. ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చు. మున్ముందు వీటి రేట్లు భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పడిపోతోండటం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వచ్చే భారీ నష్టాలను పూడ్చుకోవడానికి వాహనదారులపై పడ్డాయి.
ఈ పెంపు ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. వీటి రేట్లు ఇక్కడే అధికం. ఉత్తరాదిన రాజస్థాన్ లో అత్యధిక రేటు పలుకుతున్నాయి పెట్రోల్, డీజిల్. వాహనదారులకు అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా నిలిచాయి. అధిక వ్యాట్, రవాణా ఛార్జీల వల్ల ఆయా ప్రాంతాలలో ధరలు జాతీయ సగటు కంటే ఎక్కువ. పెంపునకు ముందు, ఆ తర్వాత కూడా పెట్రోల్ రేట్లు అధికంగా ఉన్న రాష్ట్రాలు.. ఏపీ, తెలంగాణలే.

పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న టాప్ 5 నగరాలు:
హైదరాబాద్, విశాఖపట్నం రూ. 110.89 (+రూ. 3.39), తిరువనంతపురం రూ. 110.75 (+రూ. 3.37), కోల్‌కతా రూ. 108.74 (+రూ. 3.29), పాట్నా రూ. 108.55 (+రూ. 3.01), జైపూర్ రూ. 108.19 (+రూ. 3.16)గా నమోదయ్యాయి.
డీజిల్ ధరలు అధికంగా ఉన్న టాప్ 5 నగరాలు:
తిరువనంతపురం రూ. 99.63 (+రూ. 3.37), హైదరాబాద్ రూ. 98.96 (+రూ. 3.26), భువనేశ్వర్ రూ. 96.11 (+రూ. 3.56), చెన్నై రూ. 95.47 (+రూ. 3.08), కోల్‌కతా రూ. 95.13 (+రూ. 3.11)గా ఉన్నాయి.
ధర పెంపు బేస్ స్థాయిలో రూ. 3గా ఉన్నప్పటికీ, స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్ బంకుల వద్ద వాస్తవ ప్రభావం గణనీయంగా మారుతుంది. హైదరాబాద్, తిరువనంతపురంలో నివసించేవారు ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధరలు చెల్లిస్తున్నారు. ఈ రెండు నగరాల్లోనూ పెట్రోల్ ధర రూ. 110 మార్కును అధిగమించింది.
న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 97.77 ఉండగా, హైదరాబాద్‌లో రూ. 110.89గా ఉంది. ఈ రెండు మెట్రో నగరాల మధ్య ఇప్పుడు రూ. 13.12 తేడా స్పష్టంగా కనిపిస్తోంది. డీజిల్ ధరల్లో, తిరువనంతపురం రూ. 99.63తో అత్యంత ఖరీదైన నగరంగా అగ్రస్థానంలో నిలిచింది, రూ. 100 మార్కును దాదాపు తాకింది. హైదరాబాద్ రూ. 98.96తో తర్వాతి స్థానంలో ఉంది.
అన్నింటికంటే తక్కువ ధరలతో చండీగఢ్ అత్యంత సరసమైన ప్రాంతాలలో ఒకటిగా మిగిలిపోయింది. అక్కడ పెట్రోల్ ధర రూ. 97.27, డీజిల్ ధర రూ. 85.25గా ఉన్నాయి. ఇంధన ధరల పెరుగుదలకు ప్రధానంగా అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ కారణమని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంఘర్షణ ఫిబ్రవరి 28, 2026న మొదలైంది.
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైన ఉండటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ధరల సవరణకు ముందు రోజుకు దాదాపు రూ. 1,000 కోట్ల నష్టాలను చవిచూశాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో కొనసాగుతున్న సముద్ర దిగ్బంధనం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన మార్గాన్ని అడ్డుకుంది. ఆండర్-రికవరీలు పెరుగుతున్నందున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ధరల సర్దుబాటు మున్ముందు కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications