వాస్తు ప్రకారం కిచెన్ లో ఈ మార్పులు చేసినా చాలు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి నిర్మాణంలో వంటగదికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పూజ గది తర్వాత, అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా దీనిని పరిగణిస్తారు. వంటగదిలోని వాస్తు దోషాలు కేవలం ఆర్థిక ఇబ్బందులనే కాకుండా, కుటుంబ సభ్యుల మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి, కొన్ని చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా ఇంట్లో ఆర్థిక స్థిరత్వాన్ని, సానుకూల వాతావరణాన్ని పెంపొందించుకోవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
నిర్మాణపరంగా వంటగది ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండటం అత్యుత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ దిశను అగ్ని మూలగా పేర్కొంటారు, ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. అలాగే, గ్యాస్ స్టవ్‌ను కూడా కచ్చితంగా ఆగ్నేయ మూలలోనే అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల ప్రభావాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

వంటగదిలో రంగుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అగ్నితత్వానికి అనుగుణంగా గోడలకు లేత పసుపు లేదా నారింజ రంగులను వాడటం మంచి మార్గం. ఇతతర షేడ్స్ వాడినా ఇబ్బంది లేదు కానీ, నలుపు రంగుకు మాత్రం దూరంగా ఉండాలి. నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని చెబుతారు, దీనివల్ల ఇంట్లో అనవసరమైన గందరగోళం తలెత్తే ప్రమాదం ఉంది.
నిత్యావసరాలు, ధాన్యాలు వంటి బరువైన వస్తువులను వంటగదిలో దక్షిణం లేదా పడమర దిశలో భద్రపరచడం శ్రేయస్కరం. గ్యాస్ స్టవ్ పైన కబోర్డ్లు లేదా షెల్ఫ్‌లు ఉండటం వాస్తు ప్రకారం మంచిది కాదు. కచ్చితంగా వంటగదిని క్రమపద్ధతిలో, శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.
వంటగదిలో చేసే సాధారణ పొరపాట్లలో ఒకటి 'చపాతీ పెనం' లేదా దోశ పెనాన్ని గోడకు తగిలించడం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తగ్గి, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. సానుకూలత దెబ్బతినకుండా ఉండాలంటే, ఈ అలవాటును వెంటనే మానుకోవాలని వాస్తు నియమావళి హెచ్చరిస్తోంది.
ఏదైనా వంట పూర్తయిన వెంటనే పాత్రలను, కడాయిలను శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద పాత్రలను గంటల తరబడి వదిలేయడం మంచిది కాదు. అలాగే, వేడిగా ఉన్న పాత్రలపై నీళ్లు పోయడం లేదా వెంటనే కడగడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం వాస్తు శాస్త్రానికి సంబంధించిన నమ్మకాలు మరియు ఇంటర్నెట్ లోని సమాచారం ఆధారంగా మాత్రమే రూపొందించబడింది. దీనిని ఖచ్చితమైన శాస్త్రీయ నిరూపణగా పరిగణించకూడదు. ఈ అంశాలపై న్యూస్18 ఎలాంటి ధృవీకరణ ఇవ్వడం లేదు.












Click it and Unblock the Notifications