పర్ ఫెక్ట్ 'అటుకుల ఉప్మా' .. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ అంతే..!

అటుకుల ఉప్మా(పోహా) అంటే చాలా మందికి ఇష్టం.. రుచికి రుచి.. పోషకాలకు పోషకాలు అందించే ఈ టేస్టీ అటుకుల ఉప్మాను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు. మరి రుచికరమైన అటుకుల ఉప్మా ను ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇంట్లోనే సులభంగా ఈ అటుకుల ఉప్మాను తయారు చేసుకోవడం ఎలా..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.. అటుకుల ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. అటుకులు(లావు సైజులో ఉన్నవి) రెండు కప్పులు(200 గ్రాములు), పల్లీలు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ లు, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ లు, ఉల్లిపాయలు ఒకటి, పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు చీలికలుగా చేసినవి, కరివేపాకు ఒక రెబ్బ, పసుపు అర టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు ఒక రెబ్బ, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి.

ఇప్పుడు అటుకుల ఉప్మా తయారీ విధానం చూస్తే.. ముందుగా అటుకులను తీసుకుని జల్లెడలో వేసి ఒకటికి రెండు సార్లు కడిగి నీరు మొత్తం పోనివ్వాలి. కానీ అటుకులను నాన బెట్టకూడదు. ఇప్పుడు పల్లీలు వేయించాలి. నూనెలో పల్లీలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నూనెలో పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.

AtukulaUpma Like Never Before Super Easy Recipe for Perfect Taste and Fluffy Texture AtukulaUpma

ఆ తర్వాత తక్కువ మంటపై అటుకులను పల్లీలు వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అటుకుల పోహాపై నిమ్మరసం చల్లాలి. చివరగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ అటుకుల ఉప్మా రెడీ అయినట్టే.. ఇలా అటుకుల ఉప్మాను మీరు కూడా ట్రై చేసుకోండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+