రేపే కేరళం కేబినెట్ ప్రమాణస్వీకారం..! 60 ఏళ్లలో తొలిసారి ఇలా..!

తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఒకటైన కేరళం (Keralam)లో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. కేరళ అసెంబ్లీలో 140 సీట్లకు గానూ 102 సీట్లతో ఘన విజయం అందుకున్న యూడీఎఫ్ తరఫున కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ (VD Satheesan) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు జరిగే కేబినెట్ ప్రమాణస్వీకారానికి సంబంధించిన వివరాలను ఆయనే ఇవాళ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ఈసారి కేబినెట్ ప్రమాణస్వీకారంలో ఓ కీలక అంశం ఉందన్నారు.

రేపు ఉదయం 10 గంటలకు కేరళం కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని కాబోయే ముఖ్యమంత్రి వీడీ సతీసన్ వెల్లడించారు. అయితే దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రితో పాటు పూర్తి మంత్రివర్గం రేపు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇందులో యూడీఎఫ్ కూటమిలోని కాంగ్రెస్ తో పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తారు.

Keralam CM-Designate VD Satheesan Full Cabinet to Be Sworn In Tomorrow at 10 AM After Six Decades

రేపు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే తమ ఎమ్మెల్యేల జాబితాను ఇప్పటికే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చాలా మంది మంత్రులుగా అర్హులైన నాయకులు ఉన్నారని, అయితే వీరికి అవకాశం కల్పించలేకపోతున్నట్లు కాబోయే ముఖ్యమంత్రి వీడీ సతీషన్ తెలిపారు. ఇందులో విచారం, ఇబ్బంది ఉన్నాయన్నారు. వివిధ పరిమితులు, ప్రమాణాలు, సామాజిక వాస్తవాలే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+