మద్రాస్ హైకోర్టుకు విజయ్ ? గవర్నర్ నిర్ణయంపై పిటిషన్..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (TVK)ను ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా మెజార్టీ పేరుతో తాత్సారం చేస్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు గత తీర్పులు, రాజ్యాంగం ప్రకారం చూసినా విజయ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకుండా ఉండేందుకు వీల్దేదని ఇప్పటికే న్యాయనిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయినా ఆయన తీరు మార్చుకోవడం లేదు. దీంతో గవర్నర్ తీరుపై మద్రాస్ హైకోర్టు (Madras High court) ను ఆశ్రయించేందుకు టీవీకే సిద్దమవుతోంది.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఏకైక పార్టీ తామే అయినా అందుకు అవకాశం ఇవ్వకుండా సాంకేతిక కారణాలను సాకుగా చూపడంపై టీవీకే మండిపడుతోంది. ఈ నెల 5నే తమిళనాడు పదవీకాలం ముగియడంతో రద్దు చేసారు. అయినా ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కు అవకాశం ఇవ్వకుండా ఆలస్యం చేసి.. రాజ్యాంగ సంక్షోభం పేరుతో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆగ్రహంగా ఉన్న టీవీకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతోంది.

ఇవాళ రెండోసారి గవర్నర్ తో భేటీ అయిన తర్వాత కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించకపోవడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న టీవీకే.. ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే బీజేపీ మాత్రం గవర్నర్ రాజ్యాంగ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్లు ఆయన్ను వెనకేసుకొస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ ముందున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించడమే అని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తీరుపై నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.














Click it and Unblock the Notifications