118 కాదు.. 120 ఎమ్మెల్యేల మద్దతు-సగర్వంగా గవర్నర్ వద్దకు విజయ్..!
తమిళనాడులో ఇవాళ సాయంత్రం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం వరకూ తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ కు చెందిన ఐదుగురితో కలిపి 112 సీట్ల మద్దతు మాత్రమే ఉన్న విజయ్ (Vijay)పార్టీ టీవీకే.. ఇవాళ మరికొంత మంది మిత్రుల్ని విజయవంతంగా పోగేసింది. దీంతో ఏకంగా మెజార్టీని దాటి 120 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ అర్లేకర్ వద్దకు విజయ్ బయలుదేరి వెళ్లారు. తనకు రేపు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో అలర్ట్ అయిన విజయ్.. కాంగ్రెస్ పార్టీ సాయం కోరారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వరుసగా కమ్యూనిస్టు నేతలతో పాటు వీసీకే అధినేత తిరుమాళవన్, ఐయూఎంఎల్ ను కూడా సంప్రదించారు. దీంతో వీరంతా విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో విజయ్ కు ఉన్న 107 సీట్లతో పాటు కాంగ్రెస్ కు ఉన్న ఐదు సీట్లు, వీసీకే, సీపీఐ, సీపీఎం,ఐయూఎంఎల్ కు ఉన్న తలో రెండు సీట్లు కలుపుకుంటే 120 సీట్లకు ఈ సంఖ్య చేరింది. దీంతో ఈ జాబితాను గవర్నర్ కు విజయ్ అందిస్తున్నట్లు సమాచారం.














Click it and Unblock the Notifications