ఖమేని ఒంటి చేయి రహస్యం ఇదే.. రెండో చేతికి ఏమైందంటే ??

ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక యుగానికి ప్రతీకగా నిలిచిన Ayatollah Ali Khamenei జీవితం అనేక సంఘటనల సమాహారం. మూడు దశాబ్దాలకు పైగా దేశాన్ని నడిపించిన ఆయన మరణం ఒక కీలక అధ్యాయానికి ముగింపు పలికింది. ప్రపంచానికి ఆయన కఠిన నిర్ణయాలు తీసుకునే సుప్రీం లీడర్‌గా కనిపించినప్పటికీ.. ఆయనను దగ్గరగా తెలుసుకున్న వారికి మాత్రం అతడు అసాధారణ పోరాట యోధుడు-నిజమైన "ఒంటి చేయి వీరుడు". ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..

కాగా 1980లో ప్రారంభమైన Iran-Iraq War సమయంలో ఖమేనీ దేశ భద్రత, యుద్ధ సన్నాహాల్లో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. 1981 జూన్ 27న, అప్పటి అధ్యక్షుడిగా ఒక సమావేశంలో పాల్గొంటున్న సమయంలో, ఒక వ్యక్తి టేప్ రికార్డర్ రూపంలో తీసుకువచ్చిన బాంబు అకస్మాత్తుగా పేలింది.

ayatollah-ali-khamenei-supreme-leader-of-iran-for-more-than-three-decades-how-he-lost-his-hand-detai

ఈ దాడి వెనుక Forqan Group అనే మిలిటెంట్ సంస్థ పాత్ర ఉన్నట్లు తర్వాత తెలిసింది. పేలుడు తీవ్రతతో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కుడి చేయి పూర్తిగా పనిచేయకుండా పోయింది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. కొంతకాలం ఆయన ప్రాణాలపై అనిశ్చితి నెలకొంది.

ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో, ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. "ఒంటి చేత్తో నాయకత్వం ఎలా కొనసాగిస్తారు?" అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ ఖమేనీ తన సంకల్పాన్ని చాటుతూ, "నేను ఒంటి చేయి వీరుణ్ని... నా మెదడు, నా మాట ఉన్నంత వరకు నేను వెనక్కి తగ్గను" అని చెప్పిన మాటలు ఆయన ధైర్యాన్ని ప్రతిబింబించాయి.

శరీరం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఆయన మనోధైర్యం మాత్రం కదలలేదు. కుడి చేయి పనిచేయకపోవడంతో, ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నారు. మళ్లీ ప్రజల మధ్యకి వచ్చి ప్రసంగాలు ప్రారంభించారు. ఒక నాయకుడు ఎలా తిరిగి నిలబడాలో ఆయన తన జీవితంతోనే చూపించారు. ఈ ఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, 1989లో ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముందు ఉన్న Ruhollah Khomeini స్థాయిని చేరుకోవడం పెద్ద సవాల్ అయినప్పటికీ, ఖమేనీ తన విధానాలతో దేశాన్ని ముందుకు నడిపించారు.

ఆయన పాలనలో ఇరాన్ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. అణు విధానాలపై కఠిన వైఖరి, పాశ్చాత్య దేశాలతో ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో ప్రభావం పెంపు వంటి అంశాలు ఆయన నాయకత్వాన్ని నిర్వచించాయి. అదే సమయంలో, మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలపై విమర్శలు కూడా వచ్చాయి. ఒక బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయే స్థితి నుంచి బయటపడి, శారీరక వైకల్యాన్ని అధిగమించి, దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించడం ఆయన సంకల్పానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+