కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!

నగరి నియోజకవర్గ పరిధిలోని సరిహద్దు మండలాల ప్రజల దశాబ్దాల రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా మాజీ మంత్రి ఆర్కే రోజా గట్టి పట్టుదలతో అడుగులు వేస్తున్నారు. విజయపురం మండలం ఇష్టకామేశ్వరపురం (గొల్లకండ్రిగ)-పన్నూరు సబ్‌స్టేషన్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలో (చైనేజ్ సీహెచ్‌ 73+015 వద్ద) ప్రతిష్టాత్మక చిత్తూరు-తచ్చూరు ఆరు లేన్ల జాతీయ రహదారిపై ఎంట్రీ-ఎగ్జిట్‌ ర్యాంపుతో పాటు, ఒక అనుసంధాన రహదారిని (లింక్ రోడ్) అత్యవసరంగా ఏర్పాటు చేయాలని ఆమె కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఆమె చేపట్టిన ప్రత్యేక వ్యూహం ఇప్పుడు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇచ్చే దిశగా సాగుతోంది.

సమస్య తీవ్రతను గుర్తించి ఎంపీ ద్వారా ఢిల్లీకి చేర్చిన రోజా

భారత్‌మాల పరియోజన ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్తూరు-తచ్చూరు ఆరు లేన్ల జాతీయ రహదారి ఈ ప్రాంత ఆర్థిక ప్రగతికి ఎంతో కీలకం. అయితే, ఇష్టకామేశ్వరపురం ప్రాంతం వద్ద ఈ జాతీయ రహదారికి, స్థానికంగా ఉన్న తిరుత్తణి-నాగలాపురం రాష్ట్ర రహదారికి (SH) మధ్య ఎలాంటి ప్రవేశ-నిష్క్రమణ (ఎంట్రీ-ఎగ్జిట్) మార్గాలు లేవు. దీనివల్ల ఈ భారీ జాతీయ రహదారి పక్కనే ఉన్నప్పటికీ స్థానిక ప్రజలు దాన్ని వాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Former Minister RK Roja Urges Central Govt For National Highway Entry Exit Ramp At Ishtakameswarapuram

ఈ తీవ్రమైన సమస్యను, దీని వెనుక ఉన్న ప్రజావసరాన్ని గుర్తించిన ఆర్కే రోజా.. తక్షణమే తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఎంపీ గురుమూర్తి.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఛైర్మన్, ప్రాజెక్ట్ డైరెక్టర్, రీజనల్ ఆఫీసర్‌లకు వరుస లేఖలు రాశారు. ఇష్టకామేశ్వరపురం వద్ద ర్యాంపు లేకపోవడం వల్ల జాతీయ రహదారి వల్ల ప్రజలకు చేకూరాల్సిన అసలైన ఆర్థిక ప్రయోజనాలు అందకుండా పోతున్నాయని, అక్కడ తక్షణమే సాంకేతిక అధ్యయనం (Feasibility Study) జరిపి ర్యాంపు మంజూరు చేయాలని కేంద్రానికి పంపిన లేఖలో ఎంపీ స్పష్టంగా పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!!
రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!!

వ్యూహాత్మక రవాణా కేంద్రంగా ఇష్టకామేశ్వరపురం

ఇష్టకామేశ్వరపురం భౌగోళికంగా అత్యంత కీలకమైన కూడలి. విజయపురం, నిండ్ర మండలాలతో పాటు చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రామాల ప్రజలకు ఇది ప్రధాన రవాణా హబ్‌గా ఉంది. ఇక్కడ గనుక ఎంట్రీ-ఎగ్జిట్ ర్యాంపు మరియు లింక్ రోడ్డు ఏర్పాటు చేస్తే.. అది కేవలం ఒక గ్రామానికే కాకుండా ఎన్‌హెచ్‌-716, ఎన్‌హెచ్‌-716ఏ జాతీయ రహదారులను, అలాగే తిరుత్తణి-నాగలాపురం రాష్ట్ర రహదారిని అద్భుతంగా అనుసంధానిస్తుంది.

దీనివల్ల చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన శ్రీ సిటీ సెజ్, తమిళనాడులోని తిరుత్తణి, నాగలాపురం ప్రాంతాలకు రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర వాణిజ్యం, సరుకు రవాణా రంగానికి ఇది ఒక కొత్త గేట్‌వేలా మారుతుందని రోజా తన ప్రతిపాదనల్లో వివరించారు.

రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు
రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు

ర్యాంపు ఏర్పాటుతో చేకూరే బహుముఖ ప్రయోజనాలు: ఆర్కే రోజా

ఈ రవాణా ప్రాజెక్టు సాధనపై మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. ఇష్టకామేశ్వరపురం వద్ద ర్యాంపు ఏర్పాటు అనేది ఈ ప్రాంత రూపురేఖలను మార్చే ఒక మైలురాయి కాబోతోందని స్పష్టం చేశారు.

"నేషనల్ హైవే నెట్‌వర్క్ బలపడటం వల్ల స్థానిక పారిశ్రామిక కారిడార్లకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఫలితంగా విజయపురం, నిండ్ర ప్రాంతాల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు వేగంగా, తక్కువ రవాణా ఖర్చుతో తరలించవచ్చు. ఈ రూట్ కనెక్ట్ అయితే.. దక్షిణకాశి ఆలయం, ఆరే జలపాతం, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సింగిరికోన, కైలాసకోన, శ్రీకాళహస్తి, మరియు తమిళనాడులోని కాంచీపురం కామాక్షి అమ్మన్ ఆలయాలకు వెళ్లే భక్తులకు, పర్యాటకులకు ప్రయాణ సమయం, ఇంధన వ్యయం భారీగా తగ్గుతాయి. ప్రణాళికాబద్ధమైన ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ ఉండటం వల్ల అస్తవ్యస్త ట్రాఫిక్ తగ్గి జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించబడతాయి. అంతేకాకుండా, అత్యవసర సమయాల్లో వైద్య సేవలు (ఆంబులెన్స్ రవాణా) వేగంగా అందుతాయి." అని అన్నారు.

నగరి నియోజకవర్గ సరిహద్దు ప్రజల ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను చేస్తున్న ఈ గట్టి ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, త్వరితగతిన ఈ ర్యాంపు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+