థియేటర్లలో రూ. 3వేల కోట్లు కొళ్లగొట్టి ఇప్పడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఇందులోనే..!

కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాట ఇప్పుడు అనేక సినిమాలకు వర్తిస్తోంది. ఇటీవలికాలంలో పెద్ద పెద్ద సినిమాల కంటే కంటెంట్ ఉన్న చిన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈరోజుల్లో చిన్న సినిమాల హవానే నడుస్తోంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన హాలీవుడ్ మూవీ అబ్సెషన్.. ఇప్పుడో ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. కేవలం రూ. 7 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం రూ. 3,100 కోట్లు.. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం.. ఈ రేంజ్ కలెక్షన్స్ ను ఎవరూ ఊహించలేదు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడాలు లేకుండా ఈ మూవీ విడుదలైన ప్రతి చోటా తన ప్రభంజనాన్ని కొనసాగించింది.

ఇండియాలోనూ అబ్సెషన్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారత్ లో ఏకంగా రూ. 80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దాంతో 2026 సంవత్సరానికి గానూ అత్యధిక వసూల్లు రాబట్టిన నంబర్ వన్ హాలీవుడ్ మూవీగా నిలిచింది. థియేటర్లలో కసితీరా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం రెంట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో వసూళ్ల సునామీని సృష్టించిన ఈ చిత్రం.. ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Obsession Hollywood Movie Now Available for Rent on Amazon Prime Video After 3000 Crore Success

ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే బేర్ అనే యువకుడు ఓ మ్యుజిక్ షాప్ లో పనిచేస్తుంటాడు. ఆ షాప్ లోనే పనిచేసే నిక్కీ అనే యువతిని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెకు చెప్పేందుకు నానా తంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు మేజిక్ షాపులో వన్ విష్ విల్లో అనే బొమ్మను విరగగొట్టి నిక్కీ ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలి అని కోరుకుంటాడు. ఆ తర్వాత నిక్కీలో మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది. అలా నిక్కీకి బేర్ పై ప్రేమ అధికమవుతూ పిచ్చి కింద మారుతుంది.. ఆ తర్వాత ఏం జరిగింది..? అనేది స్టోరీ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+