మ్యాథ్స్ పేపర్ లీక్. బయటపడ్డ పాక్ కుట్ర..

ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు మారుపేరుగా భావించే కేంబ్రిడ్జ్ పరీక్షల విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ సొంత పరీక్షా వ్యవస్థపై ఎప్పుడూ విమర్శలు ఉండనే ఉంటాయి, కానీ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ కేంబ్రిడ్జ్ గణిత పేపర్ లీక్ కావడం విద్యా రంగాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ లీకేజీని కేంబ్రిడ్జ్ సంస్థ కూడా అంగీకరించడం గమనార్హం. మరోవైపు, దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోనే వేలాది మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారనే భయంకర నిజం నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ సాక్షిగా బయటపడింది.

కేంబ్రిడ్జ్ గణిత పేపర్ లీకేజీ ఆరోపణలపై ఇంటర్ బోర్డ్ కమిటీ ఆఫ్ చైర్‌మెన్ (IBCC) అధికారులు కమిటీకి కీలక సమాచారాన్ని అందించారు. ఈ వివాదంపై పూర్తి వివరణ ఇవ్వాలని కేంబ్రిడ్జ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు. పాకిస్తాన్ పరీక్షా విధానం తరచుగా విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో, నమ్మదగ్గ అంతర్జాతీయ వ్యవస్థలో కూడా ఇలాంటి అక్రమాలు జరగడం విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Cambridge Math Paper Leak Confirmed in Pakistan 17 000 Islamabad Kids Missing Education in 2026 Survey
బాలికలకు విద్యకు పూర్తిగా దూరం చేసిన ఏకైక దేశం
బాలికలకు విద్యకు పూర్తిగా దూరం చేసిన ఏకైక దేశం

రాజధాని నడిబొడ్డున 'చదువు' అందని బాల్యం

నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో వెల్లడైన వివరాల ప్రకారం.. కేవలం ఇస్లామాబాద్‌లోని 30 యూనియన్ కౌన్సిల్స్‌లోనే దాదాపు 17,000 మంది పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఫెడరల్ ప్రభుత్వ పాఠశాలలు కేవలం 32,000 మంది విద్యార్థులకే వసతి కల్పించే సామర్థ్యం కలిగి ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఎడ్యుకేషన్ జునైద్ అఖ్లాక్ పేర్కొన్నారు. పాఠశాల వెలుపల ఉన్న చిన్నారులందరినీ మే 30 నాటికి బడిలో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

అర్ధరాత్రి పాక్ బలగాల క్రూరత్వం. బిడ్డ తల్లిని కూడా వదలకుండా..
అర్ధరాత్రి పాక్ బలగాల క్రూరత్వం. బిడ్డ తల్లిని కూడా వదలకుండా..

అన్-రిజిస్టర్డ్ స్కూళ్లు.. ప్రైవేట్ యాజమాన్యాల మొండివైఖరి

ఇస్లామాబాద్‌లో దాదాపు 50 అన్‌రిజిస్టర్డ్ పాఠశాలలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వాటిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తనిఖీ బృందాలను సిద్ధం చేశారు. మరోవైపు, ప్రైవేట్ పాఠశాలలు అర్హులైన విద్యార్థుల కోసం 10 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలనే నిబంధన అమలుపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1,600 ప్రైవేట్ పాఠశాలలకు గానూ, ఇప్పటివరకు కేవలం 500 పాఠశాలలు మాత్రమే ఈ నిబంధన అమలుపై నివేదికలను సమర్పించడం గమనార్హం.

విద్యా శాఖ కార్యదర్శి, మంత్రి ఈ కీలక సమావేశాలకు గైర్హాజరు కావడంపై కమిటీ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పారదర్శకత లోపించిన పరీక్షా విధానం, చదువుకు దూరమవుతున్న వేలాది మంది చిన్నారుల భవిష్యత్తు ఇప్పుడు పాకిస్తాన్ విద్యా రంగం ముందున్న అతిపెద్ద సవాల్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+