అండర్ వరల్డ్‌కు షాక్: దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ అరెస్ట్!

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దావూద్ ఇబ్రహీం.. డి-కంపెనీ (D-Company) సామ్రాజ్యంలో ఒక కీలకమైన స్తంభం కుప్పకూలింది. భారత గూఢచారి సంస్థలు, అంతర్జాతీయ పోలీసుల సమన్వయంతో సాగిన అత్యంత రహస్య ఆపరేషన్ ఫలితంగా.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత ఆప్తుడైన సలీం డోలా టర్కీలోని ఇస్తాంబుల్‌లో పట్టుబడ్డాడు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు గడగడలాడించే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన డోలా అరెస్టుతో, దావూద్ డ్రగ్స్ సామ్రాజ్యానికి లొజిస్టిక్స్ వెన్నెముక విరిగినట్లయింది.

సలీం డోలా అంటే కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు.. దావూద్ ఇబ్రహీం అంతర్జాతీయ నార్కోటిక్స్ (డ్రగ్స్) నెట్‌వర్క్‌ను సమన్వయం చేసే ప్రధాన 'మేనేజర్'. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ముంబై పోలీసుల డైరీలో డోలా పేరు పదేపదే వినిపిస్తుంటుంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు డ్రగ్స్ చేరవేసే మార్గాలను పర్యవేక్షించడం, అంతర్జాతీయ స్మగ్లర్లతో డీల్స్ కుదర్చడంలో ఇతను సిద్ధహస్తుడు. ముంబైలో జరిగిన ఒక భారీ డ్రగ్స్ స్కామ్ తర్వాత పరారీలో ఉన్న డోలా, ఇస్తాంబుల్ లో మారువేషంలో తలదాచుకుంటూ చివరకు అధికారుల చిక్కాడు.

D Company Major Blow Dawood Ibrahim Aide Salim Dola Arrested in Istanbul Interpol Red Corner Notice Nabbed

ఐఎస్ఐ (ISI) కుట్రలు.. ఆయుధాల అక్రమ రవాణా!

డి-కంపెనీ నెట్‌వర్క్ పై భారత ఏజెన్సీలు చేస్తున్న దాడులు వరుసగా విజయవంతమవుతున్నాయి. గతేడాది నేపాల్ సరిహద్దుల్లో ఆయుధాల వ్యాపారి షేక్ సలీంను పట్టుకోవడం ఈ ఆపరేషన్‌లో ఒక కీలక మలుపు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI సాయంతో భారతదేశంలోకి అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేయడం, సిద్ధూ మూసేవాలా హత్య కేసు వంటి నేరాల్లో కూడా ఈ నెట్‌వర్క్ ప్రమేయం ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పుడు డోలా అరెస్టుతో ఈ అండర్ వరల్డ్ లింకులు మరిన్ని బయటపడే అవకాశం ఉంది.

దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను..
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను..

వ్యూహం మార్చిన దావూద్: దేశీయంగానే నకిలీ నోట్లు!

మరోవైపు, నకిలీ కరెన్సీ (FICN) విషయంలో దావూద్ గ్యాంగ్ ఒక ప్రమాదకరమైన కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి దొంగనోట్లను పంపించేవారు. కానీ ఇప్పుడు భారత ఏజెన్సీల నిఘా పెరగడంతో, భారతదేశంలోనే చిన్నచిన్న రహస్య కేంద్రాల్లో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నట్లు నిఘా వర్గాలు కనిపెట్టాయి. పెద్ద మొత్తంలో కాకుండా, చిన్న మొత్తాల్లో తరచుగా మార్కెట్లోకి వదలడం ద్వారా పోలీసుల కళ్లకు గంతలు కట్టాలని డి-కంపెనీ ప్లాన్ చేస్తోంది.

మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్

ఖేల్ ఖతం.. తదుపరి లక్ష్యం దావూదేనా?

సలీం డోలాను భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు చురుగ్గా పావులు కదుపుతున్నాయి. ఇస్తాంబుల్ పోలీసులతో భారత దౌత్యవేత్తలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. డోలా నోరు విప్పితే.. దుబాయ్, పాకిస్థాన్, టర్కీలలో విస్తరించిన దావూద్ అక్రమ ఆస్తుల వివరాలు మరియు డ్రగ్స్ గొలుసుకట్టు దందాలన్నీ బయటపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డి-కంపెనీ అంతానికి ఇది ఆరంభం మాత్రమేనని భారత ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+