టేబుల్ కింద తలదాచుకున్న ట్రంప్: గాభరా పడ్డ మెలానియా
వాషింగ్టన్ డీసీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ భద్రత లోపం సంభవించింది. ఫలితంగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర పరిపాలనా అధికారులను హుటాహుటిన సురక్షిత ప్రదేశానికి తరలించాల్సి వచ్చింది. డిన్నర్ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి కాల్పులకు దిగటమే దీనికి కారణం. తక్షణమే అక్కడి వారందరూ తమ ప్రాణాలను రక్షించుకోవడానికి కిందికి వంగారు. కొందరు టేబుళ్ల కింద తలదాచుకున్నారు.
వైట్ హౌస్ వార్తలను కవర్ చేసే ప్రెస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ ఇది. వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్ లో అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏర్పాటైంది. దీనికి డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తో పాటు పలువురు వైట్ హౌస్ అత్యున్నత అధికారులు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఉన్నారు. 2,600 మంది అతిథులు పాల్గొన్నారు.

ఆ సమయంలో అతిథుల్లో ఒకరు కాల్పులకు తెగబడ్డాడు. కొన్ని పాటు కాల్పులు జరిపాడు. ఆరుసార్లు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఆ వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తం అయ్యారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, జేడీ వాన్స్ ను రక్షించడానికి వేదికపైకి దూసుకురావడం, రక్షణగా వారిని చుట్టుముట్టారు. దీంతో క్షణాల్లో అక్కడి వాతావరణం సమూలంగా మారిపోయింది. అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రదేశంలో ఒక్కసారిగా భీతావహ పరిస్థితులు అలముకున్నాయి. గందరగోళం నెలకొంది. అరుపులు కేకలతో మార్మోగిపోయింది.
కాల్పుల శబ్ది వినిపించిన వెంటనే, వేదికపై ఉన్న డొనాల్డ్ ట్రంప్ అప్రయత్నంగా టేబుల్ కింద కొద్దిసేపు తలదాచుకున్నాడు. ఆయన పక్కనే కూర్చుని ఉన్న ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ భయాందోళనలకు గురయ్యారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయుధాలతో వేదిక మీదికి చేరుకోవడం కనిపించింది. నలుగురు చొప్పున భద్రత సిబ్బంది ట్రంప్, మెలానియా ట్రంప్ చుట్టూ రక్షణగా నిల్చొని, అక్కడి నుంచి సురక్షితంగా బయటికి తరలించారు.
కొద్దిసేపటి కిందటే షూటర్ ఫొటో బయటికొచ్చింది. చేతులు వెనక్కి కట్టిన స్థితిలో అతను కనిపించాడు. షర్ట్ లేకుండా నేలపై బోర్లా పడుకుని ఉండగా.. అతని పక్కన భద్రత సిబ్బంది నిల్చొని ఉన్న ఫొటో అది. అతను ఎవరనేది ఇంకా తెలియరావట్లేదని, కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. కాల్పులకు గల కారణాలు, దీని వెనుక ఉన్న వాస్తవాల గురించి ఏజెన్సీలు దర్యాప్తు సాగిస్తున్నాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications