ట్రంప్‌ చెంప చెల్లుమనేలా కౌంటర్.. "నరకం" వ్యాఖ్యల్లో భారత్‌కి ఇరాన్‌ సపోర్ట్ !!

అమెరికా అధ్యక్షుడు Donald Trump రీసెంట్ గా చేసిన ఒక సోషల్ మీడియా రీపోస్ట్ అంతర్జాతీయ స్థాయిలో వివాదానికి దారితీసింది. అమెరికన్ రేడియో హోస్ట్ Michael Savage భారత్‌ను "నరకంతో సమానం"గా పోలుస్తూ రాసిన లేఖను ట్రంప్ షేర్ చేయడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను రేకెత్తించాయి.

ఈ వ్యాఖ్యలపై భారత్‌లోని Embassy of Iran in India గట్టిగా స్పందించింది. ముఖ్యంగా ముంబయిలోని ఇరాన్ ఎంబసీ, భారత్ గురించి సరైన అవగాహన లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొంది. భారత్‌లోని అభివృద్ధి, సాంస్కృతిక వైభవం, ఆధునిక మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే అభిప్రాయం వ్యక్తం చేయాలని సూచించింది. ట్రంప్ భారత్‌ పర్యటనకు వస్తే నిజ పరిస్థితులు అర్థమవుతాయని పేర్కొంది.

iran-strong-counter-to-us-president-donald-trump-over-his-repost-on-india-comparing-as-hell-goes-vir

ఈ సందర్భంగా మహారాష్ట్రలోని ఆధునిక నగర అభివృద్ధి, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలను చూపించే వీడియోను ఎంబసీ షేర్ చేసింది. భారత్ అనేది పురాతన నాగరికతతో పాటు ఆధునిక పురోగతిని కలగలిపిన దేశమని స్పష్టం చేసింది.

ఇప్పటికే హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ, భారత్, చైనా వంటి దేశాలు గొప్ప నాగరికతలకు పుట్టినిల్లని పేర్కొంది. ప్రపంచ చరిత్రలో కీలక పాత్ర పోషించిన దేశాలను అవమానించడం తగదని విమర్శించింది.

ట్రంప్ గతంలో కూడా అమెరికాలో అమల్లో ఉన్న జన్మతః పౌరసత్వ విధానంపై విమర్శలు చేస్తూ భారత్, చైనాలను ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. అదే నేపథ్యంలో ఈసారి చేసిన రీపోస్ట్ మరింత వివాదానికి దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో భారత్ అభివృద్ధి, ఐటీ రంగం, అంతరిక్ష విజయాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. "ముందు వచ్చి చూసి మాట్లాడండి" అనే భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+