రైతు భరోసా డబ్బులు పడలేదా? ఇలా చెయ్యండి!

తెలంగాణ రైతులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను జూన్ 30న విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా సదస్సులో స్వయంగా ఈ నిధులను విడుదల చేశారు. వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఆర్థికసహాయం అందించేందుకు రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేశారు. .

73.32 లక్షల మంది రైతులకు ఈ ప్రయోజనం

ఈ సంవత్సరం ఎకరానికి రూ.6,000 చొప్పున సహాయం అందించనున్నారు. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. మొదటి విడతలో రెండు ఎకరాలలోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. తొమ్మిది రోజుల్లో దాదాపు రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Rythu Bharosa Funds Released in Telangana Check Status Haven t received the funds Do this for money

డబ్బులు పడకపోతే ఇలా చెయ్యండి

ఇది రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన అడుగుగా చెప్పొచ్చు. అయితే చాలా మంది రైతులు డబ్బులు ఖాతాలో పడలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. రెండు రోజుల వరకు వేచి చూడాలి. అయినా డబ్బులు పడకపోతే ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

రైతు భరోసా డబ్బులు పడకపోతే ఇలా చెయ్యండి

https://rythubharosa.telangana.gov.in వెబ్‌సైట్‌ లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో Beneficiary Status లేదా Payment Status ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఆధార్ నంబర్ లేదా పట్టాదారు పాస్‌బుక్ నంబర్ నమోదు చేయండి. సబ్‌మిట్ చేయగానే మీ వివరాలు, డబ్బులు వచ్చాయా లేదా అనేది తెలుస్తుంది.

సమస్య పరిష్కారం కాకుంటే వీరిని సంప్రదించండి

డబ్బులు పడకపోతే మీ పట్టాదారు పాస్‌బుక్‌లోని వివరాలు, ఆధార్, బ్యాంక్ ఖాతా పేర్లు ఒకేలా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. పేర్లలో తేడా ఉంటే సమస్య ఏర్పడవచ్చు. ఆధార్ లింకింగ్, మొబైల్ నంబర్, IFSC కోడ్ సరిగా ఉన్నాయా లేదా అన్నది సరి చూసుకోవాలి. సమస్య కొనసాగితే స్థానిక గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయాలి.

ఆ బంగారు భూమిపై అందరి కళ్ళు!
ఆ బంగారు భూమిపై అందరి కళ్ళు!

ఆందోళన వద్దు .. అధికారుల సూచన

అధికారులు సమస్యను పరిశీలించి సరిచేస్తారు. రైతులు ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులు అందుకోవాలి. ప్రభుత్వం రైతు సంక్షేమానికి చేపట్టిన ఈ కార్యక్రమం రైతాంగానికి ఉపయోగపడుతుందని, అందుకే రైతులు ఆందోళన చెందకుండా సమస్య వస్తే పరిష్కారం చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+