అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్ కు భారీ షాక్

అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. పౌరసత్వం విషయంలో ట్రంప్‌ ప్రతిపాదనలు కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు అమెరికాలో జన్మించే పిల్లలకు పుట్టుకతోనే లభించే పౌరసత్వ హక్కును (బర్త్‌ రైట్ సిటిజన్‌షిప్) రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

జూన్ 30, 2026 నాటి ఈ చారిత్రాత్మక తీర్పులో యూఎస్ సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయానికి అత్యున్నత న్యాయస్థానం గట్టి బ్రేక్ వేసింది.

అమెరికాలో అక్రమంగా లేదా కేవలం తాత్కాలిక వీసాలపైనే నివసిస్తున్న విదేశీయుల పిల్లలకు దేశంలో జన్మించినప్పటికీ పౌరసత్వం ఇవ్వకూడదని ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఆర్డర్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమంటూ గతంలో పలు దిగువ కోర్టులు దీనిపై స్టే విధించాయి. దీంతో ట్రంప్ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధన అమెరికా దేశంలో ఎక్కడా అమలు కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దిగువ కోర్టుల తీర్పును సమర్థిస్తూ బర్త్‌ రైట్‌ పౌరసత్వ రక్షణలను మరింత బలపరిచింది.

రాజ్యాంగ సవరణను సమర్థించిన సుప్రీంకోర్టు

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వ హక్కును కల్పిస్తోందని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయాన్ని తెలియజేస్తూ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్, పౌరసత్వం అనేది హక్కులను పొందే ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించారు. దాదాపు 128 సంవత్సరాల క్రితం.. అంటే 1898 నాటి చారిత్రాత్మక 'యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్' కేసు తీర్పును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని వివరించారు.

ఈ సుదీర్ఘ కేసులో అమెరికా మట్టిపై జన్మించిన ప్రతి ఒక్కరికీ దేశంలో పౌరసత్వం పొందే హక్కు ఉందని కోర్టు మరోసారి గుర్తుచేసింది. మరోవైపు ఈ మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ జస్టిస్ క్లారెన్స్ థామస్, జస్టిస్ నీల్ గోర్సుచ్ సుమారు 91 పేజీల అసమ్మతి పత్రాన్ని దాఖలు చేశారు. కాగా ఈ ఏడాది ట్రంప్ విధానాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఇది రెండోసారి. ఫిబ్రవరిలో ట్రంప్ ప్రభుత్వం విధించిన గ్లోబల్ టారిఫ్‌ లను కూడా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Trump Suffer Major Setback US Supreme Court Proposals on Citizenship Rejected Trump Supreme Court

ట్రంప్ వివాదాస్పద నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చిన ఈ తాజా సుప్రీంకోర్టు తీర్పును స్వచ్ఛంద హక్కుల సంఘాలు, వలసదారుల తరఫున పోరాడే గ్రూపులు హర్షించాయి. పుట్టుకతో లభించే పౌరసత్వం అమెరికా ప్రాథమిక సిద్ధాంతాల్లో భాగమని వారు గుర్తుచేశారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఒక సర్వే ప్రకారం, దేశంలో జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌ గా పౌరసత్వం కల్పించే పద్ధతిని మూడొంతుల మంది అమెరికన్లు బలంగా సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలసదారులకు పెద్ద ఊరటనిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+