వెన్నలా కరిగే రవ్వ పాయసం..ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!

పండుగలు, వ్రతాలు లేదా ఏ సందర్భంలోనైనా ఇంట్లో త్వరగా, సులభంగా తయారు చేసుకునే దక్షిణ భారతీయ డెజర్ట్ రవ్వ పాయసం. రవ్వ, పాలు, పంచదారతో చేసే ఈ పాయసం చాలా మందికి ఇష్టమైనది. నెయ్యి వాసన, ఏలకుల సుగంధం, క్రిస్పీ డ్రైఫ్రూట్స్‌తో ఒక్క మాటలో చెప్పాలంటే నాలుక మీద కరిగిపోయేలా ఉంటుంది.

రుచికరమైన రవ్వ పాయసం

ఈ రవ్వ పాయసం తయారీకి పెద్దగా సమయం పట్టదు. 20-25 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ప్రత్యేకించి పండుగల సీజన్‌లో ఇంటి అతిథులకు లేదా కుటుంబం కోసం స్వీట్‌గా సర్వ్ చేయడానికి ఇది సూపర్ ఆప్షన్. మరి రుచికరమైన రవ్వ పాయసం ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి.

Easy Ravva Payasam Recipe How To Make Delicious South Indian Semolina Pudding In 20 Minutes

కావాల్సిన పదార్ధాలు

బొంబాయి రవ్వ – ½ కప్

పాలు – 1 లీటర్ (4 కప్పులు)

పంచదార – ¾ కప్ (రుచి ప్రకారం మార్చుకోవచ్చు)

నెయ్యి – 2-3 టేబుల్ స్పూన్లు

కాజూ, బాదం – 10-12

ఎండు ద్రాక్ష – 15-20

ఏలకుల పొడి – ½ టీ స్పూన్

జాజికాయ పొడి – చిటికెడు (అవసరమైతే)

తయారీ విధానం

ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి, కాజూ, బాదం ముక్కలు, ఎండు ద్రాక్షలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టండి. అదే పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి రవ్వను మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించండి. నిరంతరం కలుపుతూ ఉండాలి. మంచి వాసన వచ్చేలా వేయించడం వల్ల పాయసం రుచి డబుల్ అవుతుంది.

ఇలా చేస్తే సూపర్ టేస్టీ పాయసం

వేడిపాలు నెమ్మదిగా పోసి, మంటను తగ్గించి రవ్వ పూర్తిగా మెత్తగా ఉడికేవరకు కలుపుతూ ఉండండి. సుమారు 8-10 నిమిషాలు పడుతుంది. పంచదార వేసి మరో 3-4 నిమిషాలు ఉడికించండి. చివర్లో ఏలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. వేయించిన డ్రైఫ్రూట్స్ కూడా జోడించి రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి. వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయవచ్చు. పైన కొంచెం నెయ్యి, డ్రైఫ్రూట్స్ వేయండి.

పెళ్లిళ్ల స్పెషల్ కమ్మని రస్క్ హల్వా.. ఇలా ట్రై చేయండి!
పెళ్లిళ్ల స్పెషల్ కమ్మని రస్క్ హల్వా.. ఇలా ట్రై చేయండి!

ఈ టిప్స్ తో పాయసం సూపర్

రవ్వ ఎక్కువగా వేయించకూడదు. పాలు మంచి నాణ్యత ఉన్నవి వాడితే రుచి ఇంకా బాగుంటుంది. గట్టిగా కావాలంటే రవ్వ కొంచెం ఎక్కువ, పాయసంలా కావాలంటే పాలు ఎక్కువ వేయండి. ఈ రవ్వ పాయసం ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+