భారత్ కాళ్ల వద్దకు పాకిస్థాన్.. సంచలన నిర్ణయం దిశగా మోదీ సర్కార్..!

గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో ఇరుదేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ రద్దు, పాక్ పౌరులకు వీసాల జారీ నిలిపివేతతోపాటు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉంది పాకిస్థాన్. అక్కడ లాక్ డౌన్ తరహా పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ప్రస్తుతం ఎండలు మండిపోతున్న క్రమంలో తమకు తాగునీరు, సాగునీరు కోసం భారత్ తో మరోసారి చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత్ తో కాళ్లబేరానికి రానున్నట్లు సమాచారం అందుతోంది.

సింధూ జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్థాన్ మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించినట్లు సమాచారం. సింధూ జలాల ఒప్పందం విషయంలో తమకు భారత్ సహకరించడం లేదని భారత్ నిర్ణయం కారణంగా తమ దేశంలోని నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పాకిస్థాన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ పై మరోసారి ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ పంపిన అధికారిక లేఖను.. ఆ దేశ ప్రతినిధి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడికి అందజేశారు. సింధూ జలాలపై డేట్ షేరింగ్ ను వెంటనే పునరుద్ధరించాలని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు ఇదే విషయంపై మాజీ బ్యూరోక్రాట్ కేబీఎస్ సింధు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లో నీటి సమస్య కారణంగా ఆ దేశం భారత్ తో చర్చలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈసారి పాకిస్థాన్ చర్చలకు వచ్చినప్పుడు భారత్ తో సమాన భాగస్వామిలా కాకుండా నీటి సంక్షోభంలో ఉన్న దేశంగా వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని భారత్ గుర్తించింది. ఆ తర్వాత మే 7-10 తేదీల్లో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది.

Pakistan Cries For Help UNSC Over India s Suspension Of Indus Waters Treaty Amid Rising Summer Heat

ఇక పాకిస్థాన్ వ్యవసాయ రంగానికి సింధూ, జీలం, చీనాబ్ నదులు జీవనాడి లాంటివి. ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న తరుణంలో పాకిస్థాన్ నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ మేరకు త్వరలోనే చర్చలకు వచ్చేట్లు కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వివాదాన్ని పాకిస్థాన్.. అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి యత్నిస్తుండగా.. భారత్ మాత్రం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంగా అభివర్ణిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+