బెంగళూరులో టెర్రర్ నైట్.. ఒకే రాత్రి మూడు మర్డర్లు.. ఏం జరిగింది..?
కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రపంచ గుర్తింపు పొందిన నగరాల్లో ఒకటిగా ఉంది. బెంగళూరు జనాభా కోటీ 50 లక్షల మంది వరకు ఉంటుందని అంచనా. భారత్ లోని మెట్రో నగరాల్లో బెంగళూరు మహా నగరం ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ముంబై, దిల్లీ తర్వాత బెంగళూరు ఉంది. అయితే ఎటూ చూసినా అర్బన్ డెవలప్ మెంట్, ఐటీ కంపెనీలు, మెట్రోలో ఉరుకులు పరుగులతో ఉండే బెంగళూరు ఒక రాత్రితో ఉలిక్కిపడింది. ఆదివారం రాత్రి ఏకంగా మూడు మర్డర్లు జరిగాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ మర్డర్లతో బెంగళూరు నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం గంటల వ్యవధిలోనే ఈ మూడు ఘటనలు జరగడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.
బెంగళూరు మహానగరంలో ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల్లో మూడు మర్డర్ కేసులు నమోదయ్యాయి. మూడు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు, ఒక రౌడీ షీటర్ హత్యకు గురయ్యారు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో మొదటి ఘటనలో భాగంగా మహాలక్ష్మి లే అవుట్ ఏరియాలో 23 ఏళ్ల అంజలి అనే యువతి హత్యకు గురైంది. ఆమె శరీరంపై కత్తిపోట్లు గుర్తించారు పోలీసులు.
తన బాయ్ ఫ్రెండ్ రాజీవ్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ దంపతులు మూడేళ్లకుపైగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారాన్ని అంజలి తల్లిదండ్రులు అంగీకరించలేదు. రాజీవ్ కు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని వాళ్లు ఆరోపించారు. ఇక ఇదే వ్యవహారంపై ఇద్దరి మధ్య గొడవ చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రాజీవ్ ను వెంటనే అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
మరో ఘటనలో బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మునియప్ప లే అవుట్ లో కృష్ణ బర్మాన్ అనే 40 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెకు తెలిసినవారే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక మూడో మర్డర్ జేపీ నగర్ రోడ్డు వద్ద ఐజీ సర్కిల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనలో రౌడీ షీటర్ రాజా అలియాస్ హల్ముక్ రాజా దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. యెల్లో రంగు కారులో వచ్చిన కొందరు దుండగులు రాజాను అడ్డగించి కత్తితో దాడికి పాల్పడి హతమార్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలపై వేర్వేరుగా కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications