AIDS రాజధాని: దేశమంతా హెచ్ఐవీ!

ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాలు, విలక్షణమైన సంప్రదాయాలకు పెట్టింది పేరు ఆ దేశం. కానీ, అదే దేశం ఇప్పుడు ఒక కంటికి కనిపించని మహమ్మారి కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. దక్షిణ ఆఫ్రికాలోని అతిచిన్న దేశమైన 'ఎస్వతిని' (గతంలో స్వాజిలాండ్‌) ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవీ బాధితులున్న దేశంగా రికార్డులకెక్కింది.

కేవలం 12 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న దేశంలో సుమారు 3 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. ముఖ్యంగా 15 నుండి 49 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ వ్యాధి బారిన పడుతున్న దేశాల్లో ఎస్వతిని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఏటా కొత్తగా మరో 7 వేల మంది ఈ వైరస్ బారిన పడటం అక్కడి ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

The HIV Capital Inside Eswatini Where Every Fourth Person is Infected and Youth Face a Dark Future

పేదరికం.. పర్యాటకం.. ప్రాణాంతకం!

ఈ దుస్థితికి ప్రధాన కారణం ఆ దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికమే. జనాభాలో 60 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన మగ్గిపోతున్నారు. బతుకుదెరువు కోసం పురుషులు పొరుగున ఉన్న దక్షిణాఫ్రికా గనుల్లో కూలీలుగా వెళ్తుంటారు. అక్కడ సురక్షితం కాని లైంగిక సంబంధాల వల్ల వారు వైరస్‌ను మోసుకొచ్చి తమ భాగస్వాములకు అంటిస్తున్నారు. మరోవైపు, ఎస్వతిని సంప్రదాయ నృత్యమైన 'రీడ్ డ్యాన్స్' చూడటానికి వచ్చే విదేశీ పర్యాటకుల వద్దకు నిరుపేద మహిళలు డబ్బు కోసం వెళ్లడం కూడా ఈ వ్యాప్తికి ప్రధాన కారణమవుతోంది.

హైదరాబాద్‌లో
హైదరాబాద్‌లో

సంప్రదాయాల ముసుగులో విచ్చలవిడితనం

ఎస్వతినిలో బహుభార్యత్వం ఒక సర్వసాధారణ విషయం. సాక్షాత్తూ దేశ రాజే ఏటా జరిగే రీడ్ డ్యాన్స్ ఉత్సవాల్లో ఒక కొత్త యువతిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోవడం అక్కడ అనవాయితీగా వస్తోంది. సురక్షిత లైంగిక పద్ధతులపై అవగాహన లేకపోవడం, చిన్న వయసులోనే (పాఠశాల స్థాయిలోనే) శృంగారంలో పాల్గొనడం వంటివి వ్యాధి విస్తరణకు ఇంధనంలా మారాయి. 1986లో మొదటి కేసు నమోదైనప్పటి నుండి, మూడు దశాబ్దాల్లోనే దేశమంతా ఈ వైరస్ పాకిపోయింది.

ఎయిడ్స్ రోగులపైనా ట్రంప్ ప్రతీకారం.. మరో 40 లక్షల మందికి డెత్..!
ఎయిడ్స్ రోగులపైనా ట్రంప్ ప్రతీకారం.. మరో 40 లక్షల మందికి డెత్..!

HIV మందుల కొరతతో పోరాటం

హెచ్‌ఐవీ వ్యాప్తిని అడ్డుకోవడంలో అత్యంత కీలకమైన 'లెనాకాపవిర్' (LEN) అనే మందుల కొరత ప్రస్తుతం ఆ దేశాన్ని వేధిస్తోంది. గ్లోబల్ ఫండ్ ద్వారా అందాల్సిన 6 వేల డోసుల్లో సగం కూడా అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, గత 20 ఏళ్లుగా ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల మరణాల రేటు గణనీయంగా తగ్గడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. వ్యాధి సోకిన వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు కానీ, కొత్తగా కేసులు నమోదు కాకుండా చూడటమే ఇప్పుడు ఆ దేశం ముందున్న అతిపెద్ద సవాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+