LPG గ్యాస్ సిలిండర్ల ధరలపై కేంద్రం తాజా నిర్ణయం

Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ. 183.50 పైసల మేర తగ్గింది. తగ్గిన రేట్లు ఈ తెల్లవారు జాము నంచి అమలులోకి వచ్చాయి. కిందటి నెలలో ఒక్కో సిలిండర్ పై ఏకంగా 993 రూపాయల అదనపు మొత్తం పెరిగింది. దీంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గిన భారం చాలా తక్కువే.

ఈ ఏడాది కాలంలో కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా పెరిగిన తర్వాత, ఇంత పెద్ద ఎత్తున ధరలు తగ్గడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు కూడా తగ్గిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. పాత రేట్లే కొనసాగుతున్నాయి. వాటి ధరల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇటీవలే ఒక్కో సిలిండర్ పై 200 రూపాయల మేర అదనపు భారం మోపింది కేంద్రం.

No Change for Domestic LPG Prices as Commercial Cylinder Rate Drops From Today by Rs 183 50 Paise

నూతన రేట్ల ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3113.50 నుంచి రూ. 2930 కి దిగొచ్చింది. లక్నోలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,236 నుంచి రూ. 3,052.50 కు తగ్గింది. కోల్‌కతాలో దీని ధర రూ. 3,255.50 ఉండగా, ప్రస్తుతం రూ. 3,081.50 కి చేరింది. పాట్నాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,227 గా ఉంటోంది. 183 రూపాయల మేర తగ్గించినప్పటికీ.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో కూడా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 3,000లకు పైనే ఉండటం గమనార్హం.

గత కొద్దికాలంగా కమర్షియల్ గ్యాస్ ధరల పెరుగుదల వల్ల దేశవ్యాప్తంగా హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ధరల పెంపుతో టీ స్టాళ్ల నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకు అన్ని చోట్లా నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. సుదీర్ఘ విరామం తర్వాత లభించిన ఈ తాజా తగ్గింపుతో నిర్వహణ వ్యయం కొంతవరకు తగ్గినట్టయింది.

గత కొద్ది నెలలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ ధరలను నిరంతరాయంగా పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్, మే నెలల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ధరల్లో పెంపుదల నమోదవగా, జూన్ నెలలో సైతం ఎటువంటి సానుకూల నివేదిక రాలేదు. ఈ పరిస్థితులో జూలై మొదటి రోజునే దాదాపు రూ. 183.50 మేర భారీ తగ్గింపు లభించడం వ్యాపార వర్గాల్లో సరికొత్త ఆశలను రేకెత్తించినట్టయింది.

చమురు సరఫరా సంస్థలు ప్రతి నెల ప్రారంభంలో అంతర్జాతీయ ఇంధన ధరలు, రూపాయి విలువను ఆధారంగా చేసుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ ధరలను సవరిస్తుంటాయి. ప్రస్తుత కమర్షియల్ ధరల తగ్గింపు వ్యాపార వర్గాల్లో పెద్ద ఊరటనిచ్చినప్పటికీ, సామాన్య, మధ్యతరగతి గృహ వినియోగదారులకు సైతం రానున్న రోజుల్లో డొమెస్టిక్ గ్యాస్ ధరల తగ్గింపు రూపంలో ప్రయోజనం లభిస్తుందని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+