ఫీజు రీయింబర్స్‌మెంట్ పై విద్యార్థులకు బంపర్ న్యూస్.. ఇకపై కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సమస్యలకు పరిష్కారంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సరికొత్త విధానాన్ని అనుసరించబోతుంది. 2026- 27 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ తో పాటు, స్కాలర్షిప్ ల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచే లక్ష్యంతో కొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీనికోసం సంక్షేమ శాఖల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్

ఈ కొత్త విధానం ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో నిధుల విడుదలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి తొలి అవకాశం ఈ విధానంలో లభించనుంది. ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఒక విద్యా సంవత్సరం ఫీజులు మరుసటి విద్యా సంవత్సరం చెల్లిస్తూ ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Telangana govt has announced good news for students over Fee Reimbursement New Policy 2026

ప్రతి సంవత్సరం 2300 కోట్ల నుంచి 2400 కోట్ల రూపాయల నిధులు

ఈ క్రమంలో ఈ సమస్యకు పరిష్కారంగా, ఫీజులను అదే విద్యా సంవత్సరంలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి సంవత్సరం సుమారు 2300 కోట్ల నుంచి 2400 కోట్ల రూపాయల వరకు ఉండే నిధులను ఒకేసారి విడుదల చేయాలా లేక విడతలవారీగా ఇవ్వాలా అన్న అంశంపైన త్వరలో షెడ్యూల్ ప్రకటించనుంది.

అడ్మిషన్ ల ప్రక్రియపైనా నిర్ణయం

విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయవద్దని హైకోర్టు ఆదేశాల దృష్ట్యా ఈసారి అడ్మిషన్లకు ముందు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పైన స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు అడ్మిషన్ల ప్రక్రియలో కూడా పారదర్శకతను పెంపొందించే విధంగా కీలక మార్పులను చేయనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ షెడ్యూలు తాత్కాలికంగా రద్దు చేసింది.

ఆ శాఖలో 18వేల ఉద్యోగాలు.. పండుగ లాంటి వార్త చెప్పిన మంత్రి!
ఆ శాఖలో 18వేల ఉద్యోగాలు.. పండుగ లాంటి వార్త చెప్పిన మంత్రి!

ఇంటర్ అడ్మిషన్స్ షెడ్యూల్ లో మార్పు

విడుదల చేసిన అడ్మిషన్ ల షెడ్యూల్ తక్షణమే ఉపసంహరించుకున్నట్టు బోర్డు కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ కీలక సంస్కరణలను ప్రవేశపెట్టాలని భావిస్తున్న కారణంగా, పాత షెడ్యూల్ ను నిలిపివేసి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. ఇక దీంతో కొత్తగా ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలని అడ్మిషన్ల కోసం చూస్తున్న విద్యార్థులు మరి కొంత కాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది. త్వరలోనే మార్పు చేసిన షెడ్యూల్ను, కొత్త నిబంధనలను అధికారిక వెబ్సైట్లో ఉంచే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+