హెచ్1బీ వీసా మోసం: భారతీయ సీఈఓ అరెస్ట్


న్యూయార్క్: హెచ్‌1-బీ వీసా, గ్రీన్‌ కార్డుల దరఖాస్తుల్లో అక్రమాలకు పాల్పడిన భారతీయ సీఈవోను అమెరికా ప్రభుత్వం కటకటాల వెనక్కినెట్టింది. తప్పుడు, మోసపూరిత పత్రాలతో దాదాపు 200 హెచ్‌1బీ వీసాలను పొందిన కేసులో అమెరికాలో అజీమెట్రీ, డివెన్సి అనే రెండు ఐటీ కంపెనీలకు సీఈవో ప్రద్యుమ్న కుమార్ సామల్‌(49)ను అధికారులు అరెస్ట్‌ చేశారు.

నకిలీ, మోసపూరితమైన డాక్యుమెంట్లతో 200మంది విదేశీయులకు హెచ్‌1 బీ వీసాలు సాధించారనే ఆరోపణలతో కమార్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, వీసా మోసం కేసులో పది సంవత్సరాల జైలుతో పాటు, 250,000 డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇండియానుంచి తిరిగి అమెరికా వస్తుండగా సియాటెల్ విమానాశ్రయం వద్ద ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. 2018, ఏప్రిలో నమోదైన వీసా ఫ్రాడ్ కేసు విచారణ జరుగుతుండగా నిందితుడు సామల్‌ పారిపోయాడని అధికారులు తెలిపారు.

2010, 2011 సంవత్సరాల్లో వాషింగ్టన్‌లో హెచ్‌1-బీ వీసా, గ్రీన్‌ కార్డుల పేరుతో భారీ మోసాలకి పాల్పడాడనీ, బెంచ్-అండ్-స్విచ్‌ స్కీం కింద వీసా దరఖాస్తుల కోసం కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తన ఖాతాలోకి మళ్లించి, తద్వారా ప్రభుత్వాన్ని మోసగించాడని అధికారులు వివరించారు.

Have a great day!
Read more...

English Summary

Pradyumna Kumar Samal, the CEO of two firms in Bellevue, Washington, was arrested on a charge relating to a multi-year visa-fraud scheme.