వల్లభనేని గిరి-లోకేష్ అమెరికా పర్యటనలో కీలక వ్యక్తి-ఎవరీ టీడీపీ యంగ్ గన్..?
ఎంత ఎత్తు ఎదిగినా..ఒదిగే గుణం కొందరికి మాత్రమే ఉంటుంది. అలాంటి అతికొద్ది మందిలో ఒకరు యువకెరటం వల్లభనేని గిరి అని చెప్పొచ్చు. ఎవరు ఈ వల్లభనేని గిరి అనుకుంటున్నారా.. అతి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యలు చదివి అమెరికాలో తనదైన ముద్ర వేశారు. అగ్రరాజ్యంలో పలు వ్యాపారాలు నెలకొల్పి కీర్తి ప్రతిష్టలు సాధించారు. భారత్‌కు ముఖ్యంగా అమెరికాలో తెలుగోడి సత్తా ఏంటో చాటాడు గిరి.
ఇక తాను కష్టపడి సంపాదించింది చాలనుకున్నాడో ఏమో.. జన్మనిచ్చిన గడ్డ రుణం తీర్చుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తాను పుట్టిన విసన్నపేటకు చేరుకుని ఆ ఊరి ప్రజలకు సేవచేయసాగాడు. పలు సామాజిక కార్యక్రమాల ద్వారా అక్కడి ప్రజలకు చేరువయ్యాడు ఆప్తుడయ్యాడు. ఇంకా ఏదో తీరని వెలతి గిరిలో కనిపించింది.

తాను రాజకీయంగా ఎదిగితే ప్రజాసేవ మరింత సులభతరం అవుతుందని భావించాడు. దీంతో చిన్నప్పటి నుంచే చంద్రబాబు అన్న తన విజన్ అన్న ఎంతో ఇష్టంగా భావించి ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని రాజకీయ అరంగేట్రం చేశాడు. అయితే సామాన్య కార్యకర్తగానే తెలుగుదేశం పార్టీలో చేరి తనకు చేతనైనంతగా ప్రజలకు సేవ చేస్తున్నాడు గిరి.
తిరువూరులో గెలుపు వెనుక..
ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరులో టీడీపీ గెలుపు వెనుక వల్లభనేని గిరి కష్టం ఉందన్న సంగతి మరవకూడదు. టీడీపీ గెలుపుకోసం నియోజకవర్గం అంతా కలియతిరిగి పసుపు జెండా ఎలాగైనా ఎగిరేయాలన్న తపనతో పనిచేశారు.వైసీపీ వ్యతిరేక విధానాలపై పోరాడాడు, గొంతెత్తి నినదించారు. దీంతో గిరి అక్కడి ప్రజల దృష్టిలో పడ్డారు. ఇటు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంతటితో తన పనై పోయిందని విశ్రమించలేదు. పార్టీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని తలచి అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్ఐలతో సమావేశమై ఏపీ అభివృద్ధి కోసం ముందుకురావాలని ప్రోత్సహించారు.

అమెరికాలో లోకేష్‌తో..
ప్రస్తుతం ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ లోకేష్ విదేశీ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. వల్లభనేని గిరి లోకేష్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నారు.ఎన్నారైలను ఆకర్షించే అమరావతిలో పెట్టుబడులు పెట్టే దిశగా చర్యలు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో వల్లభనేని గిరికి ఉన్న సర్కిల్‌లోని మిత్రులను టచ్ చేసి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో సాఫ్ట్‌వేర్ కంపెనీలను తీసుకొచ్చే దిశగా ఎంఓయూలు కుదుర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.మరిన్ని పెట్టుబడులు ఏపీ రాజధాని అమరావతికి తీసుకొచ్చే క్రమంలో గిరి బిజీగా ఉన్నారు.

భవిష్యత్ రాజకీయాల్లో యువరక్తానికే ప్రాతినిధ్యమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు అతనిలో స్ఫూర్తినింపాయి. యువనేత లోకేష్ పనితీరు అతనిని రాజకీయాలవైపు మళ్లించాయి. ఏపీని అగ్రగామిగా నిలపాలన్న బాబు విజన్ నిజం చేసేందుకు తనవంతుగా బాధ్యత తీసుకోవాలనుకున్నాడు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారు. వైసీపీ అడ్డాగా ఉన్న ప్రాంతాన్ని పసుపు మయం చేసేందుకు విశేష కృషి చేశారు వల్లభనేని గిరి.












Click it and Unblock the Notifications